బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By PNR

'జన్ ధన్' ఖాతాలకు ఆధార్ నంబర్ లింకు పెట్టండి : మోడీ మనస్సులోని మాట!

జన్ ధన్ ఖాతాలను ఆధార్ కార్డును అనుసంధానం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మనస్సులోని మాటను వెల్లడించారు. తద్వారా వృద్ధాప్య, వితంతు, విద్యా రుణాలు ఇతరాత్రా ప్రభుత్వ రుణాలను వీటి ద్వారా అందజేసేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. 
 
ఈ మేరకు మోడీ బ్యాంకర్లకు ఈమెయిల్ సందేశాన్ని పంపించారు. 'జన్‌ ధన్‌' ఖాతాలకు భవిష్యత్‌‌లో రుణాలు, పింఛన్లు ఇవ్వాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. అందుకోసం తొలుత అధార్‌ను అనుసంధానించే ప్రక్రియ వేగవంతం చేయాలని బ్యాంకర్లకు ఆయన సూచించారు. 
 
ఈ పథకం రెండవ దశలో ఖాతాదారులకు పింఛన్లు అందించే దిశగా యోచిస్తున్నామన్నారు. దేశంలోని 99.74 శాతం కుటుంబాలను ఈ పథకం కిందకు తీసుకువచ్చామని, ఇది నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించిందని ఆయన అన్నారు. ఖాతాలను ఇంత భారీ స్థాయిలో సేకరించిన బ్యాంకర్లకు మోడీ అభినందనలు తెలిపారు.