Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మా అమ్మాయి, అబ్బాయి నా దృక్పథాన్నే మార్చేశారు: అంబానీ

హైదరాబాద్, గురువారం, 16 ఫిబ్రవరి 2017 (03:00 IST)

Widgets Magazine
mukesh ambani

ఆధునిక వ్యాపరవేత్తగా నా దృక్పధాన్ని, అవగాహనను మా అమ్మాయి, అబ్బాయే పూర్తిగా మార్చివేశారని రిలయెన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చెప్పారు. కొత్త సమస్రాబ్దం సమస్యలను పరిష్కరించడంలో, నూతన అవకాశాలను కనుగొనడంలో మొత్తం నా అవగాహననే వాళ్లిద్దరూ మార్చివేశారని ఇంత చేసి వారి వయస్సు 25 ఏళ్లు మాత్రమేనని ముఖేష్ కొనియాడారు. 
 
ఇంజనీర్లు, టెక్ గురులతో సహా మనందరికీ పెద్ద గుణపాఠం ఏదంటే సగటు మనిషికున్న శక్తిని మనం అర్థం చేసుకోవలసి రావడమే. ఏ టెక్నాలజీ అయినా మానవుల అవసరాలతో సర్దుబాటు కావాల్సిందే కాని టెక్నాలజీ అవసరాలతో మనిషి సర్దుకుపోవడం కాదని అంబానీ వివరించారు. 
 
మనకళ్ల ముందే ఎదుగుతున్న కొత్త టెక్నాలజీ ఎంత వైవిధ్యపూరితమైన అవకాశాలను కల్పిస్తోందో మనం గ్రహించలేకపోతున్నామని ముఖేత్ చెప్పారు. మేము జియోను ప్రారంభించినప్పుడు స్వల్పకాలంలో పది కోట్ల వినియోగదారులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే అధార్ కార్డ్, ఇ-కేవైసీ లేకుండా మేం దాన్ని సాధించి వుండేవాళ్లం కాదు. వీటివల్లే మేం రోజుకు పది లక్షలమంది వినియోగదారులను ఆకర్షించగలిగామని అంబానీ స్పష్టం చేశారు. 
 
రిలయెన్స్ జియో భావన, దాన్ని ఆచరణలోకి తీసుకురావడం వెనుక ముఖేష్ కూతురు, కుమారుల సృజనాత్మక ఆలోచన ఉందనేది తెలిసిందేWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

నోట్ల రద్దు వల్లే రఘురాం రాజన్ వెళ్లిపోయారు : చిదంబరం

భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా పని చేస్తూ వచ్చిన రఘురాం రాజన్ ఆ పదవి నుంచి ...

news

నేను పెంచి పోషించిన ఇన్ఫోసిస్‌లో ఇంత దిగజారుడా? గుండెబాదుకున్న ఎన్ఆర్ మూర్తి

‘ఉన్నత కార్పొరేట్‌ ప్రమాణాల విషయంలో ప్రపంచవ్యాప్తంగా మేం(ఇన్ఫోసిస్‌) ఎన్నో అవార్డులు ...

news

పది రూపాయల నాణేలు రద్దు.. కర్ణాటకలో పుకార్లు.. బ్యాంకులకు పరుగులు

పెద్ద నోట్ల రద్దుతో నానా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు మరో వార్త షాక్‌ను ఇచ్చింది. పది ...

news

బ్యాంకుల్లో విత్‌డ్రా పరిమితి పెంపు.. మార్చి 13 నుంచి అమల్లోకి

భారత రిజర్వు బ్యాంకుల్ నగదు విత్‌డ్రాపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది. దీంతో ఈనెల 20వ తేదీ ...

Widgets Magazine