గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 31 మే 2017 (16:28 IST)

ఆ దొంగ 14వేల ఫైళ్లను దొంగలించాడట.. గూగుల్ కోర్టు కెళ్లింది.. ఉబెర్ ఏం చేసిందంటే?

గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కారు ప్రాజెక్టు వేమో కోసం ఆంటోనీ అనే వ్యక్తి పనిచేశాడు. అయితే ఒట్టో పేరిట సెల్ఫ్ డ్రైవింగ్ ట్రప్ స్టార్టర్ పెడుతున్నానంటూ ఉద్యోగం మానేశాడు. ఉద్యోగం మానేసేలోపే గూగుల్ నుంచి భారీ

గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కారు ప్రాజెక్టు వేమో కోసం ఆంటోనీ అనే వ్యక్తి పనిచేశాడు. అయితే ఒట్టో పేరిట సెల్ఫ్ డ్రైవింగ్ ట్రప్ స్టార్టర్ పెడుతున్నానంటూ ఉద్యోగం మానేశాడు. ఉద్యోగం మానేసేలోపే గూగుల్ నుంచి భారీ ఎత్తున రహస్య ఫైళ్లు దొంగలించాడు. ఈ నేపథ్యంలోనే ఒట్టోను ఉబెర్ 2016 ఆగస్టులో కొనుగోలు చేసింది. ఇక్కడే ఉబెర్‌కు సినిమా కనిపించింది. టెక్నాలజీని దొంగలించేందుకు ఉబెర్ కంపెనీ ఆంటోనీని వాడుకుందని గూగుల్ కోర్టును ఆశ్రయించింది.
 
తమ వద్ద ఇంజినీర్‌గా పనిచేసిన ఆంటోనీ 14వేల ఫైళ్లను దొంగలించాడని గూగుల్ ఆరోపించింది. ఈ కేసుతో తలపట్టుకుని కూర్చున్న ఉబెర్.. ఇక లాభం లేదనుకుంది. చివరికి ఆంటోనని ఉద్యోగం నుంచి తొలగిస్తూ.. తమ కంపెనీ నుంచి సాగనంపింది. అతడి స్థానంలో ఇంతకుముందు బాధ్యతలు నిర్వర్తించిన ఎరిక్ హోఫర్‌కు సారథ్యం అప్పగించింది. దీంతో ఉబెర్-గూగుల్ వివాదానికి తెరపడింది.