శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 5 అక్టోబరు 2015 (10:44 IST)

నల్లధనం కుబేరులకు విత్తమంత్రి వార్నింగ్.. చర్యలకు సిద్ధం కావాలి

నల్లధన కుబేరులకు దేశ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరిక చేశారు. నల్లధనం వివరాలను వెల్లడించనందుకు తగిన మూల్యం చెల్లించుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా, భారతీయులకు చెందిన నల్లధనంలో చాలావరకు దేశంలోపలే ఉందని పేర్కొన్నారు. 
 
భారతీయులు విదేశాల్లో దాచుకున్న అక్రమాస్తులను వెల్లడించేందుకు ఆఖరి అవకాశంగా ప్రకటించిన ప్రత్యేక విండో.. నల్లధనాన్ని తిరిగి ఇండియాకు తీసుకురావడంలో విఫలమైందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జైట్లీ తాజా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సెప్టెంబర్ 30తో ముగిసిన బ్లాక్‌మనీ విండో ద్వారా 638 మంది రూ.3,770 కోట్ల విలువైన విదేశీ అక్రమాస్తులను వెల్లడించారు.
 
ఈ విండో ద్వారా వివరాలు వెల్లడించినవారు ఆస్తుల మార్కెట్ విలువపై 30 శాతం పన్ను, మరో 30 శాతం జరిమానా చెల్లించినవారి కి తదుపరి దర్యాప్తు నుంచి మినహాయింపు లభించనుంది. నల్లధనాన్ని వెల్లడించేందుకు కల్పించిన ఆఖరి అవకాశాన్ని వినియోగించుకోని వారు తీవ్ర పర్యావసానాలు ఎదుర్కోవాల్సిందేనని జైట్లీ హెచ్చరించారు. అదే బ్లాక్‌మనీ విండో ద్వారా వివరాలు వెల్లడించినవారు మాత్రం హాయిగా నిద్రగా పోవచ్చన్నారని తెలిపారు.