గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 1 జులై 2016 (11:23 IST)

జూలైలో 10 రోజులు బ్యాంకులు సెలవు: 5 ఆదివారాలు, 2 శనివారాలు, రంజాన్, 2 రోజులు సమ్మె!

జూలైలో బ్యాంకు ఉద్యోగులకు మాంచిగా విశ్రాంతి లభించనుంది. ఈ నెలలో ఏకంగా పదిరోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. జులైలో 5 ఆదివారాలు, 2 శనివారాలు, రంజాన్ పండుగ, 2 రోజులు బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో కలుపుకుని

జూలైలో బ్యాంకు ఉద్యోగులకు మాంచిగా విశ్రాంతి లభించనుంది. ఈ నెలలో ఏకంగా పదిరోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. జులైలో 5 ఆదివారాలు, 2 శనివారాలు, రంజాన్ పండుగ, 2 రోజులు బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో కలుపుకుని మొత్తంగా పది రోజుల పాటు బ్యాంకులకు హాలీడేస్ ప్రకటించారు. దీంతో వినియోగదారులకు అసౌకర్యం ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఈ నెలలో 8 రోజులు సాధారణ సెలవు దినాలే కాబట్టి బ్యాంకు లావాదేవీలపై ప్రభావం చూపే అవకాశం లేదని బ్యాంకు అధికారులు అంటున్నారు. 
 
కానీ ఏటీఎంల విషయంలో వినియోగదారులకు అసౌకర్యం కలగబోదని.. బ్యాంకులకు నేరుగా వెళ్లి డబ్బులు డ్రా చేయడంతో పాటు.. ఇతర లావాదేవీలు నిర్వహించే వారిపై సెలవుల ప్రభావం కొంత వరకు ఉంటుందని 'ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్' అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సీ.హెచ్ వెంకటాచలం తెలిపారు. అలాగే వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వివిధ ఉద్యోగ సంఘాలు 2 రోజుల సమ్మె తలపెట్టాయి. 
 
ఇప్పటికే సమ్మె నోటీసులను ప్రభుత్వానికి పంపాయి. తద్వారా మొత్తం 10 రోజులు బ్యాంకులు మూతపడనుండగా, 8 రోజులు మాత్రం బ్యాంకు ఉద్యోగులకు మంచి విశ్రాంతి లభిస్తుందని, రెండు రోజులు మాత్రం వారు సమ్మె బాట పట్టనున్నట్లు తెలిసింది.