Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అక్కడ పెట్రోల్ 52 రూపాయలే... ఎగబడికొంటున్న జనం!

మంగళవారం, 8 మే 2018 (16:05 IST)

Widgets Magazine

దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. దీంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. అయినప్పటికీ.. వినియోగదారులకు చీమకుట్టినట్టయినా లేదు.
petrol bunk
 
అయితే అస్సాంలోని భారత్- భూటాన్ సరిహద్దుకు సమీపంలో నివసించే కొందరు ప్రజలు మాత్రం ఈ పెట్రో మంట నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అస్సాంలో లీటర్ పెట్రోల్ ధర 76 రూపాయలు. అదే భూటాన్‌లో అయితే 52 రూపాయలు. 
 
అంటే అస్సాంతో పోలిస్తే భూటాన్‌లో లీటర్ పెట్రోల్‌ 24 రూపాయలు తక్కువకే దొరుకుతోంది. దీంతో భూటాన్‌లోని సంద్రుప్ జాంగ్‌ఖర్ అనే పట్టణానికి సరిహద్దుకు సమీపంలో ఉన్న భారతీయులు క్యూ కడుతున్నారు. రోజుకు కొన్ని వందల మంది పెట్రోల్ కోసం భూటాన్‌ బాట పడుతున్నారు.
 
పెట్రోల్ ఒక్కటే కాదు డీజిల్ కూడా దాదాపు 20 రూపాయలు తక్కువ ధరకే లభ్యమవుతుందట. అంతేకాదు, మద్యం కూడా 20 రూపాయలు తక్కువకే దొరుకుతుండటంతో మందుబాబులు ఎగబడి కొనుక్కుంటున్నారట. భూటాన్ కరెన్సీ గుల్ట్రం కూడా భారతీయ కరెన్సీ రూపాయి విలువకు దాదాపు సమానంగా ఉండటంతో సరిహద్దు వాసులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. దీంతో పెట్రోల్ కొనుగోలు చేసేందుకు భూటాన్ దేశానికి క్యూకడుతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

ఆనంద్‌తో ఇషా అంబానీ నిశ్చితార్థం

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ నిశ్చితార్థం ముగిసింది. ...

news

పీఎఫ్ పోర్టల్ డేటా లీకైందా? 2.7 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారుల వివరాలు?

ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాదారుల వివరాలు హ్యాక్‌కు గురైయ్యాయి. దేశవ్యాప్తంగా 2.7కోట్ల ...

news

తమిళనాడు విద్యుత్ బోర్డుతో భారత్ బిల్‌పే కీలక ఒప్పందం

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్.పి.సి.ఐ) ప్రారంభించిన ఆన్‌లైన్ పేమెంట్స్ ...

news

పెట్రో మంటను భరించాల్సిందే : తేల్చి చెప్పిన కేంద్రం

దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ధరల పెరుగులపై వినియోగదారులు ...

Widgets Magazine