శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 26 జూన్ 2016 (16:06 IST)

బ్రెగ్జిట్ ఫలితంతో ఒక్క రోజులో రూ.204 కోట్లు లాభపడింది ఎవరు?

యూరోపియన్ యూనియన్ కూటమి నుంచి బ్రిటన్ వేరుపడే నిమిత్తం బ్రెగ్జిట్ పోల్‌ను నిర్వహించారు. ఈ రిఫరెండం ఫలితాలు ఇటీవల వెల్లడయ్యాయి. ఈ ఫలితాల ట్రెండ్ ఆరంభంకాగానే ప్రపంచ మార్కెట్‌లు కుప్పకూలాయి.

యూరోపియన్ యూనియన్ కూటమి నుంచి బ్రిటన్ వేరుపడే నిమిత్తం బ్రెగ్జిట్ పోల్‌ను నిర్వహించారు. ఈ రిఫరెండం ఫలితాలు ఇటీవల వెల్లడయ్యాయి. ఈ ఫలితాల ట్రెండ్ ఆరంభంకాగానే ప్రపంచ మార్కెట్‌లు కుప్పకూలాయి. బ్రిటన్ పౌండ్ విలువ దారుణంగా పడిపోగా, స్థిరాస్తి విలువలు కరిగిపోయాయి. ప్రపంచంలోని అనేక దేశాల మార్గెట్లపై బ్రెగ్జిట్ పోల్ ఫలితం స్పష్టంగా కనిపించింది. 
 
కానీ, ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ ఒక వ్యక్తి మాత్రం ఒకే రోజు ఏకంగా రూ.204 కోట్లు లాభపడ్డాడు. ఆయనే హెడ్జ్ ఫండ్ టైకూన్ క్రిస్పిన్ ఓడే. ఆయన బ్రెగ్జిట్ ఫలితాలను ముందుగానే అంచనా వేశారు. బ్రిటన్ వాసులు ఖచ్చితంగా వేరు కుంపటికే ఓటు వేస్తారని బలంగా నమ్మాడు. ఇదే జరిగితే డాలరుతో పౌండ్ మారకం విలువ పడిపోతుందని గ్రహించాడు. దీంతో గుట్టుచప్పుడు కాకుండా బంగారంపై భారీగా పెట్టుబడులు పెట్టారు. ఫలితంగా ఆయనకు ఒక్కోరోజునే కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.