గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 28 నవంబరు 2014 (13:56 IST)

భారతీయ మార్కెట్ సంపద విలువ : రూ.1,00,00,000 కోట్లు!!

దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతీయ స్టాక్ మార్కెట్ ఆకాశమే హద్దుగా దూసుకెళుతోంది. ఇందులోభాగంగా శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్‌లో బుల్ జోరు కొనసాగడంతో భారతీయ మార్కెట్ సంపద విలువ రూ.లక్ష కోట్లకు చేరింది. 
 
గత కొన్ని రోజులుగా సెన్సెక్స్ పరుగులు పెడుతున్న నేపథ్యంలో అతి స్వల్ప కాలంలోనే భారత మార్కెట్ సంపద రూ. కోటి కోట్లకు చేరింది. అంతేకాక గడచిన దశాబ్ధంలోనే భారత మార్కెట్ సంపద దాదాపు పది రెట్ల మేర పెరిగినట్టు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
బీఎస్ఈ‌లో లిస్ట్ అయిన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ గురువారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది సేపట్లోనే అంటే సరిగ్గా 10.05 గంటలకు సంపద విలువ కోటి కోట్ల రూపాయల మార్కును తాకింది. మార్కెట్ ఇంకా వృద్ధి బాటలో సాగుతున్న నేపథ్యంలో ఈ విలువ మరింత మేర పెరగడం ఖాయమని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.