శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (18:46 IST)

రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ ఫ్రీగా ఫోన్లో మాట్లాడుకోవచ్చు... మే 1 నుంచి...

ప్రభుత్వం టెలికాం సంస్థ బీఎస్ఎన్‌ఎల్ ఇతర ప్రైవేట్ టెలికం సంస్థల పోటీ నుంచి తట్టుకునేందుకు 'ల్యాండ్ లైన్' వినియోగదారులను ప్రోత్సహించే రీతిలో మే 1 నుంచి పలు కొత్త సౌకర్యాలను పరిచయం చేయనుంది. మే ఒకటో తేది నుంచి ల్యాండ్ లైన్ కనెక్షన కలిగిన వినియోగదారులు రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు దేశ వ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లతోపాటు మరే ఇతర ప్రైవేట్ టెలికం సంస్థలకు చెందిన ల్యాండ్ లైన్‌ లేదా మొబైల్ ఫోన్ నెంబరుకైనా ఎటువంటి ఛార్జీ చెల్లించకుండా, ఉచితంగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు.
 
ఈ కొత్త పథకం గ్రామీణ, నగర ప్రాంతాలు అనే బేధం లేకుండా దేశ వ్యాప్తంగా ల్యాండ్ లైన్ కనెక్షన్ కలిగిన వినియోగదారులందరికీ వర్తిస్తుంది. అదేవిధంగా ల్యాండ్ లైన్‌లో ప్రత్యేక పథకాన్ని కలిగిన వారు, బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ కలిగిన వినియోగదారులకు కూడా ఈ సౌకర్యం వర్తిస్తుందని ఆ ప్రకటనలో వెల్లడించింది. ఈ సౌకర్యంపై ఆరు నెలల తర్వాత సమీక్ష చేస్తామని కూడా తెలియజేసింది.
 
ల్యాండ్ లైన్ కనెక్షన్‌ల వరుసలో మొదటి స్థానంలో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ ఇటీవల ట్రావ్ ప్రకటనతో బాగా వెనుకబడినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నెలలో మాత్రమే 1.62 లక్షల మంది వినియోగదారులు కనెక్షన్‌లను తొలగించుకున్నారు. దీంతో ఈ సంస్థ వినియోగదారులను ఆకర్షించేందుకుగాను కొత్త ఆఫర్లను ప్రవేశ పెట్టింది.