శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Modified: శుక్రవారం, 5 జులై 2019 (10:05 IST)

ఆదాయ పన్ను పరిమితి రూ.3 లక్షలా... కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదనలు...

స్వాతంత్ర్య భారతావనికి 48 ఏళ్ల తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ చరిత్ర పుటలకెక్కనున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. కాగా గతంలో ఇందిరాగాంధీ తొలి మహిళా ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన చరిత్ర వుంది. 
 
ఇక ఈ బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకు ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు. వేతన జీవులకు ఇపుడున్న ఆదాయపు పరిమితిని పెంచి రూ. 3 లక్షలు చేస్తారనే వాదన వస్తోంది. ఇక రైతులు, వ్యాపారస్తులకు ఇచ్చే తాయిలాలు ఎలా వుండనున్నాయన్నది ఈ రోజు తేలిపోనుంది. కాగా బడ్జెట్ ప్రతిని రాష్ట్రపతికి అందజేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.