బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (13:29 IST)

#BudgetSession2019 : ఎన్నికల బడ్జెట్.. సోపేసేందుకే వ్యక్తిగత పన్ను ఆదాయం పెంపు..?

రైతులు, మధ్యతరగతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సర్కారు వరాల జల్లు కురిపించారు. ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయెల్ తాత్కాలిక బడ్జెట్‌ ప్రకటించారు. ఆదాయపన్ను పరిమితి రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. ఇందులో వ్యక్తిగత పన్ను విషయంలో మార్పు చేశారే తప్ప.. మిగిలిన ట్యాక్స్ పేయర్స్‌కు యధావిధిగా రూ.2.50 లక్షల స్లాబ్ కింద పన్ను కట్టాల్సి వస్తుంది. ఇంటి అద్దెలపై టీడీఎస్ రూ.1.80లక్షల నుంచి రూ.2.40 లక్షలకు పెంచింది. 
 
అలాగే హౌసింగ్‌పై జీఎస్టీ భారం మోపిన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం దాన్ని పునఃపరిశీలన చేసేందుకు ప్రయత్నించింది. చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు ప్రయత్నించిందనే చెప్పాలి. కానీ జీఎస్టీని తగ్గించడంలో కేంద్రం హ్యాండ్ లేదని.. జీఎస్టీ కౌన్సిలే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వుంటుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు సోపేసేందుకే వ్యక్తిగత ట్యాక్స్‌ పరిమితిని రూ.2.50 నుంచి రూ.5లక్షలకు పెంచిందని వారు చెప్తున్నారు. ఐదు ఎకరాల్లోపు వున్న రైతులకు ప్రతి ఏటా రూ.6వేల పెట్టుబడి సాయం చేయనున్నట్లు ప్రకటించారు. 
 
ఇవన్నీ ఎన్నికల కోసం ప్రజలను ఆకర్షించేందుకు కంటితుడుపు చర్యగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లా వుంది. అలాగే వ్యక్తిగత పన్ను పెంచిన తరుణంలో జై మోదీ అంటూ సభ్యులు పలుకుతుంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా బల్లచరచడం.. చప్పట్లు కొట్టుకోవడం సరికాదని.. తమ గొప్పలు తామే చెప్పుకుంటూ తమకు తామే చప్పట్లు కొట్టుకోవడం ఏమిటని ఆర్థిక నిపుణులు అంటున్నారు.