బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Raju
Last Updated : శుక్రవారం, 20 జనవరి 2017 (06:20 IST)

నగదు రహిత లావాదేవీలు జరగాలంటే ఈ వాత పెట్టాల్సిందేనట

నూటికి 90 పైగా ఆర్థిక లావాదేవీలు నగదు రూపంలోనే జరుగుతున్న భారతదేశంలో నగదు రహిత లావాదేవీలు తక్కువకాలంలోనే వేగం పుంజుకునేలా చేయాలంటే ప్రజలకు వాతలు పెట్టాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చేసింద

నూటికి 90 పైగా ఆర్థిక లావాదేవీలు నగదు రూపంలోనే జరుగుతున్న భారతదేశంలో నగదు రహిత లావాదేవీలు తక్కువకాలంలోనే వేగం పుంజుకునేలా చేయాలంటే ప్రజలకు వాతలు పెట్టాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చేసింది. గత నెలరోజులుగా దీనికి సంబంధించి పలు చర్యలు తీసుకున్న ప్రభుత్వం ఫిబ్రవర్ 1న ప్రవేశపెడుతున్న బడ్జెట్‌లో డిజిటల్ చెల్లింపులతో లావాదేవీలకు మరింత ప్రోత్సాహమిచ్చేందుకు చర్యలు ప్రతిపాదించినట్లు సమాచారం.
 
అలాంటి చర్యల్లో ముఖ్యమైనది ఏమటంటే నగదు లావాదేవీలకు ప్యాన్ కార్డు చూపించాల్సిన పరిమితిని మరింత తగ్గించడమే. దీన్ని సులభంగా చెప్పాలంటే ప్రస్తుతం 50 వేల రూపాయలకు పైబడిన నగదును ఎవరికైనా పంపించాలంటే తప్పకుండా పాన్ క్యార్డును బ్యాంకుకు సమర్పించాల్సిందే.

ఇప్పుడీ పరిమితిని 30 వేల రూపాయలకు కుదించడం ద్వారా నగదు చెల్లింపు వ్యవస్థను బలహీనపర్చనున్నారు. అంటే ఇకపై ఎవరయినా 30 వేల రూపాయలకు మించి నగదు లావాదేవీ జరపాలంటే సంబంధిత బ్యాంకుకు ఖాతాదారు లేదా వినియోగదారు తప్పకుండా తన పర్మనెంట్ అకౌంట్ నంబర్‌ని సమర్పించాల్సిందే. 
 
తక్కువ నగదు లావాదేవీలకూ పాన్ కార్డును సమర్పించడం తప్పనిసరి చేయడం ద్వారా నగదు లావాదేవీలను సమర్థవంతంగా తగ్గించవచ్చని ప్రభుత్వం నమ్ముతోంది. వాణిజ్యపరమైన లావాదేవీల్లో నగదు వాడకాన్ని నిరుత్సాహ పర్చడానికి గాను వర్తకుల లావాదేవీ పరిమితిని ప్రస్తుతమున్న 2 లక్షల నుంచి లక్ష రూపాయలకు తగ్గించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది.