గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 5 జులై 2019 (13:41 IST)

సీతారామన్ చిట్టాపద్దు.. కొత్తగా నాణేలు.. గృహ రుణాలపై రాయితీ పెంపు..

కొత్తగా.. తొలిసారి ఇళ్లు కట్టేవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నూతన గృహ నిర్మాణదారులకు శుభవార్త చెప్పింది. కొత్త ఇంటి కోసం తీసుకునే రుణాలపై వడ్డీని భారీగా తగ్గిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. గృహ రుణాలపై వడ్డీ రాయితీ 2 లక్షల నుంచి 3.5 లక్షల వరకు పెంచుతున్నట్లు వెల్లడించారు. 
 
అలాగే గృహ రుణాలపై లక్షన్నర వరకు వడ్డీ తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. రూ.45 లక్షల రూపాయలకు లోబడిన గృహ రుణాలకు 3.5 లక్షల రాయితీ లభించనున్నట్లు ప్రకటించారు. కొత్త నాణేలు విడుదల చేయబోతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. త్వరలో 1, 2, 5, 10, 20 రూపాయల కొత్త నాణేలు విడుదల చేస్తామని తెలిపారు. ఈ కొత్త నాణేలు అంధులు కూడా గుర్తించే విధంగా రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.
 
అలాగే డిజిటల్ చెల్లింపులపై సర్ చార్జీలను ఎత్తివేస్తున్నామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఏడాదికి రూ.కోటి వరకూ నగదును విత్ డ్రా చేస్తే 2 శాతం టీడీఎస్ విధిస్తామని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో కేంద్రం వాటా 51 శాతానికి తగ్గకుండానే పెట్టుబడుల ఉపసంహరణ చేపడతామని వెల్లడించారు. స్టార్టప్‌లపై ఉండే పెండింగ్ కేసులను ఎత్తివేయాల్సిందిగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డును ఆదేశించామని చెప్పారు.