శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 29 ఫిబ్రవరి 2016 (13:06 IST)

సాధారణ బడ్జెట్ 2016 : ఆదాయ పన్ను శ్లాబుల్లో మార్పులేదు

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2016 వార్షిక బడ్జెట్‌లో వేతన జీవులను పూర్తిగా నిరాశకు లోను చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆదాయ పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయకుండా యధాతథంగా ఉంచారు. 
 
అయితే, గృహ రుణాలు తీసుకునే వారి పట్ల కరుణ చూపారు. రూ.35 లక్షల పైబడి రూ.50 లక్షల లోపు హౌసింగ్ లోన్ తీసుకునే వారికి రూ.50 వేల మినహాయింపు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. 
 
అలాగే, రూ.10 లక్షలకు పైబడి విలువ చేసే లగ్జరీ కార్లను కొనుగోలు చేసే వారిపై ఒక శాతం సర్వీస్ టాక్స్‌ను విధించనున్నారు. అలాగే, రెండు లక్షలకు మించి నగదు కొనుగోళ్ళు చేసే వారి నుంచి దీన్ని వసూలు చేస్తారు.