శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 26 నవంబరు 2014 (20:14 IST)

విడి సిగరెట్ల అమ్మకాలపై ట్విట్టర్లో పేలిన జోకులు!

విడి సిగరెట్ల అమ్మకాలపై ట్విట్టర్లో పేలిన జోకులు పేలాయి. దేశంలో విడి సిగరెట్ల అమ్మకాలను నిషేధించాలన్న సిఫారసులను కేంద్ర ఆరోగ్య శాఖ ఆమోదించిన నేపథ్యంలో  సోషల్ మీడియాలో భారీ స్పందన వచ్చింది.
 
ఏకంగా ట్విట్టర్లో అయితే జోకులు పేలాయి. ఇకపై సింగిల్ సిగరెట్ ఉన్న ప్యాకెట్లు మార్కెట్లోకి వదిలితే సరి అని ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. మరో వ్యక్తి, దీని ద్వారా రెండు విషయాలు జరుగుతాయన్నాడు. పాన్ వాలాలను వేధించడానికి పోలీసులకు మరో కారణం దొరుకుతుందని, ప్రజలు ఇకపై సిగరెట్లు తాగాలనుకుంటే గుంపుగా వచ్చి కొనుగోలు చేస్తారని ట్వీట్ చేశాడు. 
 
యాప్‌తో మీ ఏరియాలో ఉన్న స్మోకర్లను గుర్తించడం ద్వారా, సిగరెట్ ప్యాకెట్‌ను షేర్ చేసుకోవచ్చంటూ మరో ట్వీట్.. ఇలా విడి సిగరెట్లపై జోకులు పేల్చుతూ ట్విట్టర్లో జోకులు పేలుతున్నాయి.