గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 28 ఫిబ్రవరి 2015 (13:28 IST)

కార్పొరేట్ పన్ను 30 నుంచి 25 శాతానికి తగ్గింపు!

కార్పొరేట్ టాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించింది. ఇది నాలుగేళ్లపాటు వర్తిస్తుంది. కార్పొరేట్ వర్గాల నుంచి పన్ను వసూళ్లను పెంచే చర్యల్లో భాగంగా ఈ తగ్గింపు ప్రకటన చేస్తున్నట్టు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. 
 
అందువల్లే ఈ పన్ను శాతాన్ని 25 శాతానికి తగ్గించినట్టు తెలిపారు. లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయం తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ఇది అమలు అవుతుందని అన్నారు.
 
అరుణ్ జైట్లీ తీసుకున్న నిర్ణయం వల్ల ధనికులు మరింత ధనవంతులుగా మారే అవకాశాలు పెరిగాయి. ఇండియాలో 30 శాతం కార్పొరేట్ పన్ను వసూలు కావటం లేదని ఆయన పార్లమెంట్‌కు తెలిపారు. దీనివల్ల ఎంతో ఆదాయన్ని నష్టపోతున్నామని చెప్పారు.