Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆన్‌లైన్ మోసాలపై ఖాతాదారులకు పూర్తి రక్షణ.. పది రోజుల్లో ఖాతాలో జమ

హైదరాబాద్, శుక్రవారం, 7 జులై 2017 (05:37 IST)

Widgets Magazine
cheating

తమ ఖాతాలు, కార్డుల నుంచి అనధికారిక లావాదేవీలు జరుగుతున్నాయంటూ ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు పెరిగిపోవడంతో ఆర్‌బీఐ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఖాతాదారుల ప్రమేయం లేకుండా వారి ఖాతాలు, కార్డుల నుంచి జరిగే అనధికార ఎలక్ట్రానిక్‌ బ్యాంకింగ్‌ లావాదేవీల మోసాలపై మూడు రోజుల్లోపు ఫిర్యాదు చేస్తే ఇకపై రూపాయి కూడా నష్టపోవాల్సిన అవసరం లేదు. ఈ దిశగా ఆర్‌బీఐ గురువారం స్పష్టతనిచ్చింది. మూడు రోజుల్లోపు ఫిర్యాదు చేస్తే పది దినాల్లోగా సదరు మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని ఆర్‌బీఐ తెలిపింది. బీమా పరిహారం కోసం ఆలస్యం చేయడం ఉండదని స్పష్టం చేసింది. 
 
మూడో పార్టీ చేసిన మోసపూరిత లావాదేవీలపై నాలుగు నుంచి ఏడు దినాల్లోపు రిపోర్ట్‌ చేస్తే రూ.25,000 వరకు నష్టానికి ఖాతాదారుడే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.  ఖాతాదారుడి నిర్లక్ష్యం వల్ల మోసం జరిగితే, దానిపై బ్యాంకుకు ఫిర్యాదు చేసే వరకూ చోటుచేసుకునే నష్టం ఏదైనా గానీ దాన్ని ఖాతాదారుడే భరించాల్సి ఉంటుందని తెలిపింది. ఖాతాదారుడు అనధికార లావాదేవీపై బ్యాంకుకు సమాచారం ఇచ్చిన తర్వాత చోటు చేసుకునే నష్టం ఏదైనా బ్యాంకే భరించాల్సి ఉంటుందని పేర్కొంది. 
 
‘‘ఖాతాదారుడు వైపు నుంచి, బ్యాంకు వైపు నుంచి లోపం లేకుండా, వ్యవస్థలో ఎక్కడో లోపం కారణంగా మూడో పక్షం చేసిన ఉల్లంఘనపై ఖాతాదారుడికి ఎటువంటి బాధ్యత లేదు. అయినప్పటికీ అనధికార లావాదేవీ గురించి ఖాతాదారుడు మూడురోజుల్లోపే బ్యాంకుకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంకు నిర్లక్ష్యం, లోపం, సాయం కారణంగా అనధికారిక లావాదేవీ చోటు చేసుకుంటే, ఖాతాదారుడు దానిపై సమాచారం ఇచ్చినా, ఇవ్వకపోయినా ఈ విషయంలోనూ అతడికి ఎటువంటి బాధ్యత ఉండదు’’ అని ఆర్‌బీఐ మార్గదర్శకాల్లో పేర్కొంది. 
 
మోసంపై ఏడు రోజుల తర్వాత ఫిర్యాదు చేస్తే దానిపై ఖాతాదారుల బాధ్యత ఎంత మేరకు అన్నది బ్యాంకుల బోర్డు విధానం మేరకు నిర్ణయించడం జరుగుతుందని  ఆర్‌బీఐ వివరించింది.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

మార్కెట్లోకి డైనమిక్ డిజైన్, ఆకర్షణీయమైన మెర్సెడెజ్ బెంజ్ జిఎల్ఎ కారు

ప్రముఖ మెర్సిడెస్ బెంజ్ తన SUV పోర్ట్ ఫోలియోను మరింత దృఢపరుస్తూ కొత్త జిఎల్ఎను ...

news

పాత నోట్ల మార్పిడికి మరో ఛాన్స్... సుప్రీం ఆదేశాలతో కేంద్రం చర్యలు

దేశంలో పెద్ద విలువ కలిగిన రూ.500, రూ.1000 నోట్లను కేంద్రప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత ...

news

ఆధార్‌తో పాన్‌ కార్డు అనుసంధానంలో రికార్డు బద్దలు.. 7.36 కోట్ల మంది పాటించారు

ఆదాయ పన్ను రిటర్న్‌ల ఈ–ఫైలింగ్‌ కోసం జూలై 1 నుంచి ఆధార్‌తో పాన్‌ కార్డు అనుసంధానం ...

news

హమ్మయ్య.. క్రెడిట్ కార్డు చెల్లింపులకు నగదు పరిమితి లేదట.. కండిషన్స్ అప్లై

నగదు లావాదేవీలు రెండు లక్షల రూపాయలకు మించకూడదన్న పరిమితులపై కేంద్రం కొన్ని మినహాయింపులను ...

Widgets Magazine