Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దేశంలో కరెన్సీకి కరవు .. ఎటు చూసినా నో క్యాష్ బోర్డులే

మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (11:19 IST)

Widgets Magazine

దేశ వ్యాప్తంగా కరెన్సీ నోట్లకు కరవు ఏర్పడింది. ఎటు చూసినా నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. దీంతో జనం కరెన్సీ నోట్లకు గగ్గోలు పెడుతున్నారు. నిజానికి నిన్నా మొన్నటి వరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఏటీఎం‌ల్లోని నో క్యాష్ బోర్డులు కనిపించేవి. ఇపుడు ఇప్పుడు దేశం మొత్తం ఇదే పరిస్థితి నెలకొంది.
atm centre
 
ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోని 80 శాతం ఏటీఎం‌లలో నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. రెండు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. పని చేసే ఏటీఎంల్లోనూ వందల మంది క్యూ. అలా డబ్బు పెడితే.. ఇలా అయిపోతుంది. బీహార్ రాజధాని పాట్నాలోని రాజ్ భవన్ ఏరియాలోని ఏటీఎంల్లోనూ డబ్బు లేదు అనే బోర్డులు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. సీఎంతోపాటు ఇతర ప్రముఖులు నివాసం ఉండే ఈ ప్రాంతంలో రెండు రోజులుగా ఏటీఎం సెంటర్లలోనూ నో క్యాష్ బోర్డులు వేలాడుతున్నాయి. 
 
ఇక మధ్యప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా స్పందించారు. మార్కెట్‍లో 2 వేల నోట్లు కనిపించటం లేదని.. ఈ నోట్లు ఎక్కడికి వెళ్లాయి అని అధికారులను ప్రశ్నించారు. యూపీ, గుజరాత్ రాష్ట్రాల్లో 85 శాతం ఏటీఎంలు 48 గంటలుగా పని చేయటం లేదు.
 
దేశంలోని నగదు కొరత నోట్ల రద్దు నాటి పరిస్థితులను గుర్తు చేస్తోంది. ఎక్కడికి వెళ్లినా డబ్బు లేదు అనే మాట వినిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై భారత రిజర్వు బ్యాంకు స్పందించింది. వరుసగా వచ్చిన పండుగలు, శుభకార్యాలు, పెళ్లిళ్లతో నగదు కొరత ఏర్పడిందని.. మూడు, నాలుగు రోజుల్లో పరిస్థితి సర్దుకుంటుందని ప్రకటించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

చందా కొచ్చర్ భవితవ్యం ప్రశ్నార్థకం... భర్త ఆ పనిచేశాడు.. రాజీనామా చేసేస్తారా?

శక్తిమంతమైన మహిళల జాబితాలో నిలిచి, ఐసీఐసీఐ బ్యాంకు సీఈవోగా ఎన్నోఏళ్ల పాటు సేవలందించిన ...

news

పీఎన్బీ స్కామ్: నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు నాన్ బెయిలబుల్ వారెంట్లు

పీఎన్బీ స్కామ్‌లో విచారణ ఎదుర్కొనేందుకు భారత్‌కు రాకుండా విదేశాల్లో గడుపుతున్న నీరవ్ మోదీ ...

news

తత్కాల్ టైమింగ్స్ మారింది... రూటు మారితే రిఫండ్

రైలు ప్రయాణికులకు ఓ విజ్ఞప్తి. ప్రస్తుతం అమల్లో ఉన్న తత్కాల్ టైమింగ్స్ మారాయి. ఇందుకోసం ...

news

మరిది మేలుకోరి... అరడజను కంపెనీలకు అనుమతి.. చిక్కుల్లో ఆమె...

ఐసిఐసిఐ బ్యాంక్‌ సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌ చందా కొచ్చర్ క్విడ్‌ ప్రో కో ఆరోపణల్లో ...

Widgets Magazine