శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 21 అక్టోబరు 2016 (10:55 IST)

డీజిల్‌పై పన్నులు బాదండి... పెట్రోల్‌తో సమానంగా ధరలు పెంచండి.. రాష్ట్రాలకూ కేంద్రం లేఖలు

దేశంలో డీజిల్ ధరలను భారీగా పెంచాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా పెట్రోల్ ధరలకు సమానంగా డీజిల్ ధరలు పెంచాలని ఆ లేఖల్లో పేర్కొంది.

దేశంలో డీజిల్ ధరలను భారీగా పెంచాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా పెట్రోల్ ధరలకు సమానంగా డీజిల్ ధరలు పెంచాలని ఆ లేఖల్లో పేర్కొంది. 
 
సాధారణంగా పెట్రోల్ ధరలతో పోల్చితే డీజిల్‌ ధర తక్కువ. పైగా డీజిల్‌కు వచ్చే మైలేజ్‌ కూడా ఎక్కువే. అందుకే చాలామంది వాహనదారులు డీజిల్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతారు. ఈ డిమాండ్‌కి తగ్గట్టే డీజిల్‌ ఇంజన్ వాహనాల ధరలు పెట్రోల్‌ వాహనాల కంటే ఎక్కువగా ఉంటాయి. 
 
అయినప్పటికీ దీర్ఘకాలంలో డీజిల్‌ ధరల రూపంలో, మైలేజీ రూపంలో వచ్చే ప్రయోజనాల కోసం కొనుగోలుదారులు డీజిల్‌ వాహనాలకే ఓటేస్తున్నారు. కానీ.. పెట్రోల్‌ వాహనాల కన్నా డీజిల్‌ వాహనాలు భారీగా కాలుష్యాన్ని వెలువరిస్తాయు. ఈ నేపథ్యంలో డీజిల్‌ వాహనాల కొనుగోళ్లను నిరుత్సాహపరచాలని కోరుతూ కేంద్రం అన్ని రాష్ట్రాలకూ లేఖలు రాసింది. 
 
దేశంలో కాలుష్యాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంటే పన్నులు పెంచడం ద్వారా డీజిల్‌ ధరలను పెట్రోల్‌తో సమానం చేయడం. వివిధ రకాల పన్నుల ద్వారా డీజిల్‌ ఇంజన్‌ వాహనాల ధరలు పెంచడం. డీజిల్‌ వాహనాల లైఫ్‌ ట్యాక్స్‌ పెంచడం. రిజిస్ట్రేషన్ సమయంలో ఇతర ఫీజులు పెంచడం. వంటి చర్యల ద్వారా డీజిల్‌ వాహనాల కొనుగోళ్లను నిరుత్సాహపరచాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు అవసరమైతే అన్ని రాష్ట్రాలూ మోటార్‌ వాహనాల చట్టంలో సవరణలు చేయాలని సూచనలు చేసినట్టు సమాచారం.