శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 7 ఫిబ్రవరి 2015 (11:35 IST)

లాభాపేక్షలేని పారదర్శక వ్యవస్థ కావాలి : అనిల్ అంబానీ

ప్రస్తుతం దేశానికి ఎలాంటి లాభాపేక్షలేని పారదర్శక దర్యాప్తు సంస్థలు కావాలని రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ స్పష్టం చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ముంబైలో పలువురు పారిశ్రామికవేత్తలు, బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న అనిల్ అంబానీ ప్రసంగిస్తూ ప్రభుత్వ విచారణ సంస్థలు సీబీఐ, సీవీసీ, కాగ్‌లు ఆలస్యంగా తీసుకునే నిర్ణయాల వల్ల కొంత భయమేస్తోందన్నారు. 
 
ఏదైనా స్కాంలో సత్వర నిర్ణయాలు తీసుకుంటే అందరూ దాని గురించే మాట్లాడుకుంటారని, దానివల్ల అవినీతిపరులను పరిశోధన, విజిలెన్స్, ఆడిట్ సంస్థల దర్యాప్తు పరిధిలోకి తీసుకురావచ్చన్నారు. అయితే, లాభాపేక్షలేని పారదర్శక వ్యవస్థను తీసుకురావాలని తాను కోరడంలేదన్నారు. 
 
ఇటీవల కేంద్రం బొగ్గు క్షేత్రాల ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని ఆయన ప్రశంసించారు. మహారాష్ట్రలో ఓ పెద్ద పెట్టుబడిదారుగా చాలా అడ్డంకులు ఎదుర్కొన్నామని, సత్వర నిర్ణయం తీసుకునే అంశం మెరుగవ్వాల్సి ఉందన్నారు.