శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 11 జులై 2017 (09:26 IST)

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అండగా ఫౌండర్ ఇనిస్టిట్యూట్

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అండగా ఫౌండర్ ఇనిస్టిట్యూట్ నిలుస్తోంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన "మేక్ ఇన్ ఇండియా" కార్యక్రమంలో భాగంగా స్టార్ట్-అప్స్‌లను అభివృద్ధి చేసే దిశగా ఈ ఇన

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అండగా ఫౌండర్ ఇనిస్టిట్యూట్ నిలుస్తోంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన "మేక్ ఇన్ ఇండియా" కార్యక్రమంలో భాగంగా స్టార్ట్-అప్స్‌లను అభివృద్ధి చేసే దిశగా ఈ ఇనిస్టిట్యూట్ కృషి చేస్తోంది. ఇందులోభాగంగా, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు 14 వారాలపాటు ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. ఇందుకోసం ఫీజుగా రూ.26 వేలను వసూలు చేస్తుంది.
 
ఈ శిక్షణలో కేవలం థియరీ కంటే ప్రాక్టికల్స్‌కే అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో ఉండే ఆలోచనలు, నైపుణ్యానికి తగినవిధంగా కంపెనీలు నెలకొల్పి, వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్నదానిపై ఈ ఇనిస్టిట్యూట్ ప్రత్యేకంగా శిక్షణ ఇస్తుంది. 
 
ఇలా ఈ కేంద్రంలో శిక్షణ పొంది తమ ఆర్థిక స్థోమతకు తగిన విధంగా స్టార్ట్‌-అప్‌లు పెట్టి నిలదొక్కుకున్న ఐదుగురు యంగ్ పారిశ్రామికవేత్తలను నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పరిచయం చేసింది. అలాగే, వింటర్ 2017 బ్యాచ్ స్నాతకోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించింది. ఇందులో చెన్నై చాప్టర్‌లో ఐదు కంపెనీలకు అధిపతులుగా ఉన్న దిపాంకర్ ఘోష్, శ్యామ్ సుందర్, సతీష్ సలీవతి, రంజన్ బీఎల్, సుబ్రమణియన్ రాజమాణిక్యంలను పరిచయం చేసింది. 
 
కాగా, ప్రపంచవ్యాప్తంగా మొత్తం 155 దేశాల్లో ఈ ఇనిస్టిట్యూట్ కేంద్రాలు ఉండగా, భారత్‌లో చెన్నై, బెంగుళూరుల్లో ఉండగా, త్వరలో కొచ్చిలో ప్రారంభించనున్నారు. ఈ కేంద్రంలో రమేష్ కుమార్, భూవాణన్‌లతో పాటు మరికొంతమంది మెంటర్లుగా ఉన్నారు. ఈ స్టార్ట్-అప్‌ల వల్ల ఆర్థిక శక్తిని సమకూర్చుకోవడమే కాకుండా, అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని వారు పేర్కొన్నారు.