బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By chitra
Last Updated : శనివారం, 24 సెప్టెంబరు 2016 (15:29 IST)

జియో సిమ్ కార్డు కావాలా.. అయితే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోండి.. డోర్ డెలివరీ పొందండి!

మొబైల్‌ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ 'రిలయన్స్‌ జియో' పేరుతో 4జీ సేవలు అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జియో సిమ్‌ కోసం రిలయన్స్‌ డిజిటల్‌ ఎక్స్‌ప్రెస్‌, డి

మొబైల్‌ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ 'రిలయన్స్‌ జియో' పేరుతో 4జీ సేవలు అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జియో సిమ్‌ కోసం రిలయన్స్‌ డిజిటల్‌ ఎక్స్‌ప్రెస్‌, డిజిటల్‌ ఎక్స్‌ప్రెస్‌ మినీ స్టోర్స్‌ సహా ఎంపిక చేసిన అవుట్‌లెట్ల వద్ద జనాలు ఇప్పటికీ బారులు తీరుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ల హవా కొనసాగుతున్న నేపథ్యంలో ఇంటర్నెట్‌ డేటాకు సంబంధించి అతి తక్కువ టారిఫ్‌ను వసూలు చేస్తోంది. 
 
ఇతర ఆపరేటర్లు 1జీబీ 3జీ/4జీ డేటాను రూ.250కి అందిస్తుండగా, రిలయన్స్‌ మాత్రం మూడు నెలల పాటు ఉచిత అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌, మరీ ముఖ్యంగా అన్‌లిమిటెడ్‌ ఇంటర్నెట్‌ వినియోగించుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. దీంతో జనం జియో సిమ్‌ కోసం బారులు తీరుతున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఈ డిమాండ్‌ను చేరుకోలేని జియో, దానికి తగినవిధంగా సిమ్‌లను అందించడంలో పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. అయితే మొబైల్ నెంబర్ పోర్టబులిటీ ద్వారా సర్వీసులను అందిస్తున్న జియో, త్వరలోనే ఇంటి వద్దకు సిమ్‌లను డెలివరీ చేసే స్కీంను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది. 
 
ప్రస్తుతం జియో సిమ్ కావాలంటే, రిలియన్స్ జియో డిజిటల్ ఎక్స్‌ప్రెస్ స్టోర్స్ దాకా వినియోగదారులు వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ ఎలాగైనా సిమ్ సంపాదించుకున్నా, అది యాక్టివేట్ అయ్యేపాటికి మరో 15 నుండి 20 రోజుల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆన్‌లైన్‌లో రిలయన్స్ జియో పోర్టల్‌లో వివరాలు నింపితే, ఇంటివద్దకే జియో సిమ్ డెలివరీ అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తోంది రిలయన్స్ సంస్థ. ఇంతకుముందు ఎయిర్ టెల్ ఇదే విధానాన్ని 4జి వినియోగదారుల కోసం అందించింది. 4జి కవరేజ్‌లో ఉన్న వినియోగదారులు సిమ్ కావాలంటే, ఎయిర్‌టెల్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేస్తే… 4జి సిమ్‌లను ఇంటికే పంపించే విధానాన్ని అవలంభించనుంది.