శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (17:23 IST)

16 ఏళ్ల తర్వాత బంగారం ధరలు డౌన్: ఆరు వారాల నుంచి పడిపోతున్న గోల్డ్!

ఆర్థిక సంక్షోభం సమయంలో బంగారం అమాంతంగా పెరిగిపోవడంతో.. అమ్మాయిలకు పెళ్లి చేయాలంటనే తల్లిదండ్రులు జడుసుకున్నారు. మరి ఇప్పుడాపరిస్థితి లేదు. బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా ఆరు వారాల నుంచి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. 1999 తరువాత ఇలా వరుసగా ఆరు వారాల పాటు ధరల్లో తగ్గుదల నమోదు కావడం ఇదే తొలిసారి అని వాణిజ్య నిపుణులు అంటున్నారు. 
 
16 సంవత్సరాల తరువాత బంగారం ధరలు ఓ దీర్ఘకాల పతనాన్ని కళ్లజూశాయని, అంతేగాకుండా, రెండేళ్ల తరువాత అతిపెద్ద నెలవారీ పతనం కూడా నమోదైందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఫిబ్రవరి 2010లో 1,077 డాలర్ల వద్ద ఉన్న ఔన్సు బంగారం ధర, సుమారు ఐదున్నరేళ్ల తరువాత అదే స్థాయికి చేరుకుంది. ఈ వారంలో ధర ఒక శాతానికి పైగా పడిపోయింది. మొత్తం మీద జూన్ 2013 తరువాత అతిపెద్ద నెలవారీ నష్టాన్ని నమోదు చేస్తూ, బంగారం ధర జూలైలో 7.5 శాతం మేరకు తగ్గింది.