శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2015 (16:44 IST)

మరింత తగ్గిన బంగారం - వెండి ధరలు.. పెరిగిన దిగుమతులు

అంతర్జాతీయంగా డిమాండ్ గణనీయంగా తగ్గడంతో బంగారం, వెండి ధరలు కూడా బాగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం నాటి మార్కెట్ రేట్ల ప్రకారం హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల మేలిమి బంగారం పది గ్రాములు 25,140 రూపాయలు ఉండగా... 22 క్యారెట్ల నగల తయారీ బంగారం 23,820 రూపాయలు పలుకుతోంది. అలాగే, వెండి కేజీ 36,626 రూపాయలుగా ధర పలుకుతోంది. 
 
ఇదే పరిస్థితి కొనసాగినట్టయితే మున్ముందు కూడా మరింతగా ధరలు తగ్గే అవకాశం ఉంది. దీంతో కొనుగోలుదారులు బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేయాలా వద్దా అనే అంశంపై డైలామాలో ఉన్నారు. మరోవైపు దేశంలో బంగారం దిగుమతులు 61శాతం పెరిగాయి. ఏప్రిల్, మేలో 155 టన్నుల గోల్డ్‌ దిగుమతి అయ్యింది. ప్రధానంగా నగల వ్యాపారుల నుంచి గోల్డ్‌కు డిమాండ్ పెరిగడంతో దిగుమతులు పెరిగినట్టు బంగారు వ్యాపారులు చెపుతున్నారు.