బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 27 జనవరి 2017 (06:09 IST)

నగదు విత్‌డ్రా కష్టాలకు నెలరోజుల్లో చెక్‌: పరిమితి ఎత్తివేతకు బ్యాంకుల కసరత్తు

నగదు విత్‌డ్రా కష్టాలకు ఒక నెలరోజుల్లో చెక్ పడుతుందని విశ్వసనీయ సమాచారం. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో విధించిన బ్యాంకులు, ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా పరిమితిని ఫిబ్రవరి చివరికల్లా రిజర్వు బ్యాంకు తొలగించనున్నట్లు బ్యాంకర్లు వెల్లడించారు.

నగదు విత్‌డ్రా కష్టాలకు ఒక నెలరోజుల్లో చెక్ పడుతుందని విశ్వసనీయ సమాచారం. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో విధించిన బ్యాంకులు, ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా పరిమితిని ఫిబ్రవరి చివరికల్లా రిజర్వు బ్యాంకు తొలగించనున్నట్లు బ్యాంకర్లు వెల్లడించారు. నగదు విత్‌డ్రా పరిమితిని ఫిబ్రవరి చివరికి లేక మార్చి మొదటి అర్ధ భాగంలో పూర్తిగా తొలగించనున్నట్లు గురువారం బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆర్కే గుప్తా మీడియాకు తెలిపారు. ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక ప్రకారం ఫిబ్రవరి చివరికల్లా 78–88% కొత్త కరెన్సీ వ్యవస్థలోకి వచ్చేస్తుంది. మరో 2 నెలల్లో నగదు విషయంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయి.
 
ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ మాత్రం బ్యాంకింగ్‌ వ్యవస్థ నిర్ధేశిత సమయంలో సాధారణ పరిస్థితులకు రావడంపై స్థాయీ సంఘానికి స్పష్టంగా చెప్పలేదు. అయితే రద్దయిన పెద్ద నోట్ల స్థానంలో రూ. 9.2 లక్షల కోట్లు లేక 60% కొత్త నోట్లను ప్రవేశపెట్టినట్లు వివరించారు. ఆర్బీఐ ఇటీవలే ఏటీఎంల్లో విత్‌డ్రా పరిమితిని రోజుకు రూ. 10,000 పెంచి, వారంలో పరిమితిని మాత్రం సేవింగ్స్‌ అకౌంట్లకు రూ. 24,000, కరెంట్‌ అకౌంట్లకు రూ. లక్ష కొనసాగించడం తెలిసిందే.