Widgets Magazine

త్వరలోనే పెట్రోల్ ధరలు తగ్గుతాయ్ : నితిన్ గడ్కరీ

ఆదివారం, 10 డిశెంబరు 2017 (10:37 IST)

Widgets Magazine
nitin gadkari

దేశంలో పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. పొరుగు దేశాలతో పోల్చితే భారత్‌లో పెట్రో మంటలు తారా స్థాయిలో ఉన్నాయి. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గత యూపీఏ ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచితే ఎడ్లబండిపై పార్లమెంట్‌కు వెళ్లిన బీజేపీ నేతలు... ఇపుడు అధికారంలో ఉండి ఎడాపెడా పెట్రోల్ ధరలు పెంచేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. పెట్రోల్ ధరలను తగ్గించాలని గగ్గోలు పెడుతున్నప్పటికీ బీజేపీ పాలకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 
 
ఈ నేపథ్యంలో పెట్రోల్ ధరలు త్వరలోనే పెట్లోల్ ధరలు తగ్గుతాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. పెట్రోల్ ధరలను అతి త్వరలో తగ్గిస్తామన్నారు. పెట్రోల్‌లో 15 శాతం మిథనాల్‌ను కలపడం ద్వారా ఇది సాధ్యమేనంటున్నారు. కాలుష్యాన్ని కూడా తగ్గించొచ్చని అంటున్నారు. ఇందుకు సంబంధించి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తానే ప్రకటన చేస్తానన్నారు. 
 
లీటర్‌ పెట్రోల్‌ ఖరీదు దాదాపు 80 రూపాయలు ఉంటుండగా, బొగ్గు నుంచి ఉత్పత్తి అయ్యే లీటర్‌ మిథనాల్‌ మాత్రం రూ.22కే లభిస్తుందనీ, చైనాలో అయితే ఈ ధర మరీ రూ.17 మాత్రమేనని ఆయన గుర్తు చేశారు. 
 
స్వీడన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ వోల్వో ముంబై కోసం పూర్తిగా మిథనాల్‌తో నడిచే ప్రత్యేక బస్సులను తయారుచేసిందనీ, త్వరలోనే 25 బస్సులను నగరంలో తిప్పేందుకు ప్రయత్నిస్తామన్నారు. మిథనాల్‌ను ముంబైలో ఉన్న స్థానిక పరిశ్రమల నుంచే ఉత్పత్తి చేయవచ్చనీ, వాటి నుంచి వచ్చే ఇంధనాన్నే ఈ బస్సులకు వాడతామన్నారు.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

ఆధార్-పాన్ అనుసంధానం: మార్చి31 2018 వరకు గడువు పెంపు

ఆధార్ నెంబర్‌ను పాన్ కార్డులు, బ్యాంకు ఖాతాలకు లింక్ చేసేందుకు డిసెంబర్ 31వరకు యూఐడీఏ ...

news

కొత్త నోట్ల రంగులేంటి? సైజులేంటి? ఢిల్లీ హైకోర్టు ప్రశ్న

పెద్దనోట్లను రద్దు చేసిన అనంతరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త నోట్లను ...

news

కారుంటే గ్యాస్ రాయితీ కట్.. కేంద్రం అడుగులు

వంట గ్యాస్‌పై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీని పూర్తి రద్దు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ...

news

అమేజాన్ డెలివరీ ఉమెన్ ఏం చేసిందో తెలుసా? (వీడియో)

అమెజాన్ సంస్థలో పని చేసే డెలివరీ ఉమెన్ ఓ పాడుపని చేసింది. సీసీటీవీ ఫుటేజ్ చూసిన ఇంటి ...