గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 జులై 2015 (10:57 IST)

గ్రీస్ సంక్షోభం భారత్‌కు లాభమే.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిపోతాయట!

గ్రీస్ సంక్షోభంతో ప్రపంచ దేశాలు సైతం ఆర్థిక సంక్షోభం భయంతో వణికిపోతున్న తరుణంలో.. గ్రీస్ సంక్షోభం భారత్‌కు మేలే చేస్తుందని తెలియవచ్చింది. అప్పులు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న గ్రీస్ పతనంతో ఉపయోగించే పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గుతాయట. గ్రీస్ పరిస్థితులు చమురు మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీశాయని నిపుణులు వ్యాఖ్యానించారు. కాగా, క్రూడాయిల్ ధరలు మరింతగా పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఇండియాలో 'పెట్రో' ఉత్పత్తుల ధరలు మరింతగా ఊరటనిస్తాయి.
 
గ్రీస్, ప్యూర్టోరికో, ఆపై స్పెయిన్, పోర్చుగల్ ఇలా పలు ప్రపంచ దేశాలు రుణాల ఊబిలో ఉన్నాయని వస్తున్న వార్తలు క్రూడాయిల్ ధరలపై ప్రభావం చూపాయి. బుధవారం నాటి ఆసియన్ సెషన్లో ముడి చమురు ధర 60 డాలర్ల దిగువకు చేరుకుంది. ఆగస్టులో డెలివరీ అయ్యే క్రూడాయిల్ ధర 58.79 డాలర్లకు తగ్గిందని నిపుణులు చెబుతున్నారు.