శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 9 సెప్టెంబరు 2016 (11:50 IST)

జీఎస్టీ బిల్లుకు ఆమోదముద్ర వేసిన రాష్ట్రపతి ప్రణబ్

జీఎస్టీ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. దీంతో జీఎస్టీ బిల్లుపై మరో ముందడుగు పడినట్టయింది. గత ఆగస్టులో పార్లమెంట్‌ ఆమోదం పొందిన జీఎస్టీ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జి ఆమోదముద్

జీఎస్టీ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. దీంతో జీఎస్టీ బిల్లుపై మరో ముందడుగు పడినట్టయింది. గత ఆగస్టులో పార్లమెంట్‌ ఆమోదం పొందిన జీఎస్టీ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదముద్ర కూడా పడింది. 
 
ఆగస్టు ఎనిమిదిన రాజ్యసభలో ఈ బిల్లును నెగ్గించుకున్న ప్రభుత్వం దానిని రాష్ట్రాల అసెంబ్లీలకు పంపింది. 17 రాష్ట్రాల ఆమోదం పొందిన తర్వాత జీఎస్టీ బిల్లును రాష్ట్రపతి కార్యాలయానికి ప్రభుత్వం చేర్చింది. 
 
దీనిపై రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముక్ అధియా మాట్లాడుతూ... బిల్లుకు సంబంధించి రాష్ట్రాల ఆమోదం పొందే ప్రక్రియ 30 రోజులో పూర్తి చేయాల్సి ఉండగా దానిని 23 రోజులలో పూర్తి చేయగలిగామన్నారు. ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదం కూడా పొదడంతో దానిని జీఎస్టీ కౌన్సిల్‌కు పంపనున్నారు.