గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 17 సెప్టెంబరు 2016 (14:34 IST)

ఏటీఎం పిన్ నంబర్లు తక్షణం మార్చండి : ఖాతాదారులకు బ్యాంకుల సూచన

ఏటీఎం, నెట్ బ్యాంకింగ్ పిన్ నంబర్లను తక్షణం మార్చుకోవాలని పలు బ్యాంకులకు అధికారులు సూచన చేశారు. ఇటీవల ఢిల్లీ, చండీగఢ్, కేర‌ళ‌ రాష్ట్రాల్లో ఏటీఎం, నెట్ బ్యాంకింగ్ మోసాలు వెలుగు చూశాయి. ఈ మోసాల ద్వారా ల

ఏటీఎం, నెట్ బ్యాంకింగ్ పిన్ నంబర్లను తక్షణం మార్చుకోవాలని పలు బ్యాంకులకు అధికారులు సూచన చేశారు. ఇటీవల ఢిల్లీ, చండీగఢ్, కేర‌ళ‌ రాష్ట్రాల్లో ఏటీఎం, నెట్ బ్యాంకింగ్ మోసాలు వెలుగు చూశాయి. ఈ మోసాల ద్వారా లక్షలాది రూపాయలు మాయమయ్యాయి. దీంతో ఖాతాదారుల‌కు ప‌లు బ్యాంకులు హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నాయి. 
 
ఖాతాదారులు ఏటీఎం కార్డు పిన్ నంబ‌రుతో పాటు ఆన్ లైన్ బ్యాంకింగ్ పాస్ వర్డ్ లను మార్చుకోవాల‌ని బ్యాంకులు త‌మ మెసేజ్ పంపుతున్నాయి. ప్ర‌ధానంగా హెచ్‌డీఎఫ్‌సీ, డీబీఎస్‌, ఫెడరల్ బ్యాంక్ తమ ఖాతాదారుల సెల్‌ఫోన్ల‌కు సందేశాలు పంపుతున్నాయి. జ‌రుగుతోన్న మోసాల‌పై కూడా అవ‌గాహ‌న కల్పిస్తున్నాయి. 
 
ఏటీఎం సెంట‌ర్ల‌లో సెక్యూరిటీ గార్డు లేని, ప్ర‌జ‌లు అధికంగా క‌నిపించ‌ని ప్రాంతాలలోని ఏటీఎం లావాదేవీలను ఆపేయాల‌ని కూడా బ్యాంకులు కోరుతున్నాయి. కొన్ని రోజుల క్రితం కేరళలో రోమేనియన్ వ్యక్తి ఓ ఏటీఎం సెంట‌ర్లో ఖాతాదారుల ఏటీఎం కార్డుల వివ‌రాలు సేక‌రించే స్కిమ్మింగ్ పరికరాన్ని అమర్చుతూ పోలీసుల‌కు దొరికిపోయిన విష‌యం తెలిసిందే.