గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 23 ఫిబ్రవరి 2015 (14:50 IST)

స్విస్ బ్యాంకులో నల్లధనాన్ని దాచుకున్న హెచ్‌ఎస్‌‌బీసీ ఛైర్మన్‌!

తమ బ్యాంకుపై పడిన నల్లధనం మచ్చను చెరిపి వేస్తానంటూ బహిరంగంగా ప్రకటన చేసిన హెచ్.ఎస్.బి.సి బ్యాంకు ఛైర్మన్ స్టువర్ట్ గలివర్ చిక్కుల్లో చిక్కుకున్నారు. నల్లఖాతా ఉన్న కుబేరుల సంగతి దేవుడెరుగ కానీ... ఆయన మాత్రం ఏకంగా నల్లధనం ఖాతా తెరిచి ఏకంగా 7.6 మిలియన్ డాలర్ల సొమ్మును దాచుకున్నట్టు సమాచారం.
 
ఈ మేరకు బ్రిటన్‌కు చెందిన గార్డియన్ పత్రిక ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంపై గలివర్ నోరు మెదపలేదు. ఉద్యోగ జీవితంలో అందిన బోనస్‌లను దాచుకునేందుకే గలివర్ స్విస్ ఖాతాను వినియోగిస్తున్నారని ఆయన ప్రతినిధి వెల్లడించారు. గార్డియన్ కథనంపై హెచ్ఎస్‌బీసీ కూడా ఏమాత్రం స్పందించలేదు.