గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 8 మార్చి 2016 (12:38 IST)

ఉమెన్స్ డే స్పెషల్ : మహిళలకు ఐసీఐసీఐ బంపర్ ఆఫర్.. వర్క్ అట్ హోం

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళామణులకు ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ సెక్టార్ ఐసీఐసీఐ బ్యాంకు ఓ అపురూపమైన కానుకను ప్రకటించింది. అనివార్య కారణాలతో ఉద్యోగం పని మానేయకుండా ఉండేందుకు వీలుగా ఇంటి వద్ద నుంచి పని చేసే వెసులుబాటును కల్పించనున్నట్టు ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐసీఐసీఐ బ్యాంకు ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. 
 
'ఐ వర్క్@హోమ్' పేరుతో ప్రత్యేక పోర్టల్‌ను తెరిచి... మహిళలు ఇంటి దగ్గర నుంచి పనిచేసే అవకాశాన్ని కల్పించింది. తమ బ్యాంకులో పనిచేసే మహిళలు పిల్లల కోసం ఉద్యోగానికి రాజీనామా చేయడం, ఎక్కువ నెలల పాటూ విధులకు హాజరుకాకపోవడం వంటి సమస్యలు లేకుండా చేయడం కోసమే ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్టు బ్యాంకు సీఈవో చందా కొచ్చర్ వెల్లడించారు. 
 
ఇప్పటికే 50 మంది మహిళలు ప్రస్తుతం వర్క్ ఎట్ హోమ్ విధానంలో పనిచేస్తున్నారని. మరో 125 మంది ఇంటి దగ్గర పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. త్వరలో ఈ విధానంలో పనిచేసే వారి సంఖ్యని 500కు పెంచుతామని ఆమె ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ విధానం వల్ల మెటర్నిటీ లీవ్ నెలల తరబడి తీసుకోవాల్సిన అవసరం ఉండదని తెలిపారు. కాగా, ప్రస్తుతం ఈ బ్యాంకులో ప్రపంచ వ్యాప్తంగా 73 వేల మంది మహిళలు పనిచేస్తున్నారు.