Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వెబ్ సైట్ కుప్పగూలితే తప్ప ఆదాయ పన్ను శాఖ మేల్కొదు.. ఆ పాన్ కార్డులు చెల్లుతాయట

చెన్నై, శనివారం, 1 జులై 2017 (05:15 IST)

Widgets Magazine

వెబ్ సైట్ కుప్పగూలితే తప్ప ఆదాయ పన్ను శాఖ మేల్కొదు అని మరోసారి రుజువైంది. పాన్‌ కార్డుతో ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్‌ జారీచేసిన విషయం తెలిసిందే. ఆధార్‌తో పాన్‌ కార్డు అనుసంధానానికి ఈరోజే ఆఖరి తేదీ అని ప్రకటించడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీంతో పెద్దసంఖ్యలో ప్రజలు ఆధార్‌ అనుసంధానానికి ఇన్‌కమ్‌ట్యాక్స్‌ వెబ్‌సైట్‌ను ఆశ్రయిస్తుండటంతో ఆ సైట్‌ సర్వర్‌పై భారం పడి కార్యకలాపాలు నిలిచిపోయాయి. 
 
ఈ నేపథ్యంలో ‘ప్రజలారా ఆందోళన చెందొద్దు .. ఎవరూ భయపడొద్దు. జూన్‌ 30 తర్వాత ఆధార్‌తో అనుసంధానం కాని పాన్‌ కార్డులు రద్దు కావు’ అని సీబీడీటీ ఛైర్మన్‌ సుశీల్‌ చంద్ర స్పష్టంచేశారు. ఈ అంశంపై మరో నోటిఫికేషన్‌ విడుదల చేసేంత వరకూ ఆధార్‌తో అనుసంధానం లేకపోయినా పాన్‌ కార్డులు చెల్లుతాయని వెల్లడించారు.
 
ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌లో జులై 1, 2017 నుంచి పాన్‌ కార్డు ఉన్న ప్రతి వ్యక్తీ ఆధార్‌ నంబర్‌ను సెక్షన్‌ 139ఏఏ లోని సబ్‌సెక్షన్‌ (2) ప్రకారం తప్పనిసరిగా అనుసంధానం చేసి డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇన్‌కం ట్యాక్స్‌ -డీజీఐటీ (సిస్టమ్స్‌)కు తెలియజేయాల్సి ఉంటుందని తెలిపింది. ఆదాయ పన్ను చట్టంలోని 114వ నిబంధనల్లో పలు సవరణలు చేసినట్టు పేర్కొంది. దీని ప్రకారం జులై 1 నుంచి ఐటీ రిటర్న్స్‌ ఫైలింగ్‌కు పాన్‌-ఆధార్‌ అనుసంధానం తప్పనిసరంటూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు స్పష్టంచేసిన విషయం తెలిసిందే.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

GST... రూ. 5 లక్షల కారు కొనేవారికి రూ.5 వేలు తగ్గింపట... హిహ్హిహ్హ్హీ....

జీఎస్టీ పన్నుపై సెటైర్లు మామూలుగా వుండటంలేదు. అటు మధ్యతరగతి వారికి వాతలు పెట్టేస్తున్న ...

news

జూలై ఒకటి నుంచి జీఎస్టీ విధానం... పన్నుపోటు లేని వస్తువులేవి?

ఒకే దేశం.. ఒకే పన్ను విధానం జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ వస్తు సేవల పన్ను ...

news

జీఎస్టీకి ముందు - తర్వాత పన్ను రేట్లు ఎలా ఉంటాయంటే...

'ఒకే దేశం.. ఒకే పన్ను' విధానమంటూ స్వతంత్ర భారతావనిలోనే అతిపెద్ద ఆర్థిక సంస్కరణకు ...

news

డేటింగ్ ప్రియులపై జీఎస్టీ భారమెంత? కండోమ్‌లు, గర్భ నిరోధక మాత్రలపై పన్ను నిల్

వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానం జూలై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ...

Widgets Magazine