శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 2 మార్చి 2015 (09:32 IST)

అంతర్జాతీయ సంస్థకు అధిపతిగా స్టాక్ మాంత్రికుడు!

స్టాక్ మాంత్రికుడు ప్రపంచ ప్రఖ్యాత ఈక్విటీ ఇన్వెస్టర్‌గా పేరున్న వారెన్ బఫెట్ వ్యాపార సామ్రాజ్య పగ్గాలను భారత్‌కు చెందిన అజిత్ జైన్‌కే దక్కే అవకాశముంది.

అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో భారతీయుడు వారెన్ ప్రముఖ అంతర్జాతీయ సంస్థకు అధిపతిగా సత్తా చాటనున్నాడు. 84 ఏళ్ల బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హ్యాత్‌వే సంస్థ .. ప్రస్తుతం ఆయన వారసుడిని వెతికే పనిలో ఉంది.
 
ప్రధానంగా జైన్, గ్రెగ్ ఎబెల్ మధ్యే పోటీ ఉంది. అయితే ఈమధ్య సంస్థ ఉద్యోగులకు బఫెట్ రాసిన వార్షిక లేఖలో జైన్‌ను ప్రశంసించిన తీరును బట్టి చూస్తే ఆయన్నే వారసుడిగా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఈ మేరకు విశ్లేషకులు కూడా బఫెట్ వారసుడు జైన్‌నేనని భావిస్తున్నారు. 
 
ఒడిశాలో జన్మించిన 63ఏళ్ల జైన్.. ఐఐటీ, హార్వర్డ్ వంటి ప్రఖ్యాత ఇన్‌స్టిట్యూట్లలో విద్యనభ్యసించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆయన బఫెట్‌తో కలిసి పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన బెర్క్‌షైర్ రీఇన్య్యూరెన్స్ గ్రూప్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.