Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వృద్ధురాలిని కిందపడేసిన సిబ్బంది... సారీ చెప్పిన ఇండిగో

సోమవారం, 13 నవంబరు 2017 (12:57 IST)

Widgets Magazine
indigo flight

దేశంలో ఉన్న ప్రైవేట్ విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రతిష్ట మరోమారు మంటగలిసింది. ఇటీవల బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో ముంబై ఎయిర్‌పోర్టులో ఆ సంస్థ గ్రౌండ్ సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఓ ప్రయాణికుడిని కిందపడేసి పిడిగుద్దులు కురిపించారు. ఈ రెండు ఘటనలతో ఆ సంస్థపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పైగా ఆ ఘటనలు మరిచిపోకముందే మరో సంఘటన జరిగింది. 
 
ఓ వృద్ధురాలిని వీల్‌చైర్ నుంచి తీసుకెళుతూ కిందపడేశారు. ఆ తర్వాత ఆమె సారీ చెప్పారు. ఈ వివరాలను పరిశీలిస్తే, లక్నో విమానాశ్రయంలో ఊర్వశి పారిఖ్ విరేన్ అనే ప్రయాణికురాలిని వీల్‌‌చైర్లో ఇండిగో సిబ్బంది అరైవల్ హాల్‌కు తీసుకెళ్తుండగా ఆమె కిందపడిపోయారు. దీనిపై క్షమాపణలు చెబుతూ ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రకటన విడుదల చేసింది.
 
ఆ ప్రకటనలో "నిన్నరాత్రి 8 గంటలకు లక్నో విమానాశ్రయంలో జరిగిన ఈ దుర్ఘటనపై ఊర్వశి పారిఖ్‌కు క్షమాపణ తెలుపుతున్నాం. మా ప్రతినిధి ఒకరు అమె వీల్‌చైర్‌ను వెహికిల్ లేన్ మీదుగా అరైవల్ హాల్ వైపు నెడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. రాత్రిపూట కావడంతో అక్కడ వెలుతురు సరిగా లేకపోవడానికి తోడు అదే ప్రాంతంలోని తారురోడ్డుపై గుంతపడటం వల్ల వీల్‌‌చైర్ బ్యాలెన్స్ తప్పిపోయింది. దీంతో ఆమె కిందపడి గాయపడ్డారు. మా సిబ్బంది వెంటనే ఆమెను ఎయిర్‌ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వైద్యుడి వద్దకు తీసుకెళ్లి వైద్యం అందించారు. ప్రథమ చికిత్స చేసిన తరువాత ఆమె కోలుకున్నారు" అంటూ ఇండిగో తెలిపింది. 
 
ఈ ఘటనలో మానవ తప్పిదంలేదని ఆమె తెలిపారని ఇండిగో పేర్కొంది. ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన అని ఇండిగో సంస్థ స్పష్టం చేసింది. ఏది ఏమైనా ఇండిగో సిబ్బంది తీరుతో ఆ సంస్థ పేరు ప్రతిష్టలు మసకబారుతున్నాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

ఎయిర్‌ ఏషియా బంపర్ ఆఫర్.. రూ.99లకే ఫ్లైట్ జర్నీ

మలేషియాకు చెందిన బడ్జెట్ విమానయాన సంస్థ ఎయిర్‌ ఏషియా (ఇండియా) బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది ...

news

దిగివచ్చిన అరుణ్ జైట్లీ.. 177 వస్తువులపై పన్ను భారం తగ్గింపు

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ దిగివచ్చారు. దేశంలో 'ఒకే దేశం - ఒకే పన్ను' ...

news

బీమా పాలసీలకు కూడా ఆధార్ లింకు చేయాల్సిందే...

బీమా పాలసీలకు కూడా ఆధార్ నంబరు లింకు చేయాల్సిందేనంటూ భారత బీమా నియంత్రణ, ప్రాధికార సంస్థ ...

news

పెద్దనోట్ల రద్దుతో ఒరిగిందేమిటి? విదేశాల్లో మూలుగుతున్న 90శాతం నల్లధనం.. (వీడియో)

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కార్ పెద్ద నోట్ల రద్దు అమలు చేసి నేటికి (నవంబర్ 8వ తేదీ) ...

Widgets Magazine