Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రూ.50వేలకు మించి బంగారం కొనుగోలు చేస్తే పాన్ కార్డ్ తప్పనిసరి..

మంగళవారం, 31 జనవరి 2017 (12:36 IST)

Widgets Magazine
gold jewellery

ప్రస్తుతం రూ.2లక్షలకు మించి బంగారం కొంటే కేవైసీ వివరాలు అందించాల్సి ఉంది. అయితే ఇకపై ఆ పరిమితి రూ.50వేలకు తగ్గింది. బంగారం కొనుగోలుపై కేంద్రం మరో నిబంధనను అమలు చేసేందుకు సిద్ధమైంది 50వేల రూపాయలకు మించి బంగారం కొనుగోలు చేసే వినియోగదారులు తప్పనిసరిగా పాన్ కార్డ్ కలిగి ఉండాలని, పాన్ కార్డు వివరాలు అందజేయాలనే నిబంధనకు కేంద్రం మొగ్గు చూపుతోంది.

బుధవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించే అవకాశముంది. నల్ల ధనాన్ని నియంత్రించేందుకే ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. 
 
ఇదిలా ఉంటే.. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ.. పారిశ్రామికీకరణతో ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషి చేస్తామన్నారు. కోటి మంది యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ ఏడాది 20 లక్షల టన్నుల పప్పుధాన్యాలు సేకరించడమే లక్ష్యమన్నారు. నాబార్డు మూల నిధి రూ. 41వేల కోట్లకు పెంచామని రాష్ట్రపతి తెలిపారు. ప్రసూతి సెలవులు 12 వారాల నుంచి 26 వారాలకు పెంచామన్నారు.
 
బ్లాక్ మనీ, అవినీతి గణనీయంగా తగ్గాయని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. స్వచ్ఛ భారత్‌ను ప్రజా ఉద్యమంలా చేపట్టామన్నారు. కోటి 20లక్షల మంది గ్యాస్ సబ్సిడీని వదులుకోవడం ప్రశంసనీయమని కొనియాడారు.

దీన్ దయాళ్ గరీబ్ కల్యాణ్ పథకం ద్వారా పేదల సంక్షేమానికి ఎన్నో ముఖ్య చర్యలు ప్రభుత్వం చేపడుతోందన్నారు. 26కోట్ల జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేశామన్నారు. బ్లాక్ మనీ, అవినీతి గణనీయంగా తగ్గాయని పేర్కొన్నారు. క్యాష్ లెస్ విధానం సమర్ధంగా అమలవుతోందని స్పష్టం చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం, అవినీతి గణనీయంగా తగ్గాయి: ప్రణబ్ ముఖర్జీ

దేశంలో పెద్ద నోట్ల రద్దుతో బ్లాక్ మనీ, అవినీతి గణనీయంగా తగ్గాయని రాష్ట్రపతి ప్రణబ్ ...

news

స్వతంత్ర భారతావనిలో ఇదో చారిత్రాత్మక ఘట్టం : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించిన రాష్ట్రపతి ...

news

ఏటీఎంల నుంచి డబ్బు డ్రా ఇక మీ ఇష్టం... కానీ...

ఇప్పటివరకూ బ్యాంకు ఖాతాల్లో వున్న డబ్బును తీసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ...

news

పెద్దనోట్ల రద్దు దేశంలోనే అతిపెద్ద కుంభకోణం: ఎద్దేవా చేసిన పి. చిదంబరం

పెద్దనోట్ల రద్దు దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర ఆర్థిక శాఖ ...

Widgets Magazine