గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 24 అక్టోబరు 2020 (16:51 IST)

చికెన్ కావాలా, నిజామాబాద్‌లో కెఎఫ్‌సి ఇండియా తన మొదటి రెస్టారెంట్‌ ప్రారంభం

‘‘ప్రపంచంలో అత్యంత రుచికరమైన చికెన్’’ అందించడంలో ఖ్యాతినార్జించిన కెఎఫ్‌సి ఇండియా తన మొదటి రెస్టారెంట్‌ను నిజామాబాద్ నగరంలో ప్రారంభించింది. కోడిమాంసాన్ని ఇష్టపడే వారి కోసం సరికొత్త గమ్యస్థానంగా దీన్ని ప్రగతి నగర్‌లోని వేణు మాల్‌లో ఏర్పాటు చేశారు. హాట్ & క్రిస్పీ చికెన్, చికెన్ పాప్‌కార్న్, చికెన్ స్ట్రిప్స్, జింగర్ బర్గర్ తదితర కెఎఫ్‌సి ఫేవరెట్స్ కోసం రెస్టారెంట్‌కు విచ్చేయండి; మరియు ఐకానిక్ కెఎఫ్‌సి బకెట్‌ని మీ చేతులతో అందుకోండి.
 
ఈ బ్రాండ్ తన ప్రత్యేకమైన మెనూ సమర్పణ & ఉత్పత్తులతోనే కాకుండా, 4X సేఫ్టీ ప్రామిస్ ఆఫ్ శానిటైజేషన్, స్క్రీనింగ్, సోషల్ డిస్టెన్సింగ్ మరియు కాంటాక్ట్‌లెస్ సేవలతో నగరంలో తన సేవలను ప్రారంభించింది. రెస్టారెంట్‌లో ప్రతి 30 నిమిషాలకు ఒకసారి టేబుళ్లు, కౌంటర్లు, తలుపులు, తలుపుల హ్యాండిళ్లను తీవ్రస్థాయిలో శానిటైజేషన్ చేస్తారు.
 
డెలివరీ బృందాలు ప్రతి ఆర్డర్ తర్వాత వారి చేతులు మరియు సంచులను శుభ్రపరచుకోవడంతో పాటు వారికి క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయడం మరియు నిత్యం ఉష్ణోగ్రత పరీక్షలు, మాస్కులు ధరించి ఉండడం, ఎల్లప్పుడూ గ్లౌజులు ధరించి ఉండేలాగా జాగ్రత్తలు తీసుకుంటారు. వినియోగదారులు భౌతిక దూరాన్ని పాటించేందుకు మరియు డెలివరీ రైడర్లు ఆర్డర్ల కోసం క్యూలో ఉన్నప్పుడు కనీసం 6 అడుగుల సురక్షితమైన దూరాన్ని పాటించేందుకు అనుగుణంగా నేలపై స్టిక్కర్లను అంటించారు.
 
వేణు మాల్‌లో ఉన్న ఈ రెస్టారెంటు 2264 చ.అడుగుల విస్తీర్ణంలో ఉండగా, 78 మంది కూర్చునేందుకు సదుపాయాలు ఉన్నాయి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వినియోగదారులు తమకు ఇష్టమైన కెఎఫ్‌సి ఫేవరెట్స్, వివిధ రకాల ఆహార పదార్థాలను డెలివరీ, టేక్‌ఎవే, మీ కారు/బైకు వద్దకే కెఎఫ్‌సి విధానాల్లో అందుకొని ఆస్వాదించవచ్చు (మీరు యాప్‌లో ప్రీ-పెయిడ్ ఆర్డర్ ఇచ్చి రెస్టారెంటు సమీపంలో నిలిపిన మీ వాహనం వద్దకు డెలివరీ చేయగలిగిన సందర్భాల్లో).
 
అన్నీ సురక్షితమైన కాంటాక్ట్‌లెస్ విధానాల్లో డైన్-ఇన్‌లోనూ అందుకోవచ్చు. అదే విధంగా మీకు ఇష్టమైన వాటిని మీ సౌకర్యానికి అనుగుణంగా ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌లో కెఎఫ్‌సి యాప్ ద్వారా (యాప్ స్టోర్ మరియు ప్లే స్టోర్ లలో లభిస్తుంది) లేదా కెఎఫ్‌సి వెబ్‌సైట్ లేదా మొబైల్ సైట్లో ఆర్డర్ చేసుకుని మీకు కావలసినవి తెప్పించుకోవచ్చు. రెస్టారెంటు చిరునామా: కెఎఫ్‌సి రెస్టారెంట్, గ్రౌండ్ ఫ్లోర్, షాప్ నం.1, వేణు మాల్, ఫులాంగ్ రోడ్డు, హైదరాబాద్ రోడ్డు, ప్రగతి నగర్, నిజామాబాద్, తెలంగాణ.