శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 25 ఫిబ్రవరి 2016 (13:27 IST)

రైల్వే బడ్జెట్ లైవ్: పుణ్యక్షేత్రాల సుందరీకరణలో తిరుపతికి స్థానం!

2016-17 రైల్వే బడ్జెట్‌లో భాగంగా పుణ్యక్షేత్రాల సుందరీకరణలో తిరుపతికి స్థానం లభించినట్లు కేంద్ర రైల్వే శాఖా మంత్రి సురేశ్ ప్రభు పేర్కొన్నారు. ప్రధాన ఆలయాలను కలుపుతూ టూరిస్ట్ సర్క్యూట్ ట్రైన్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. తక్కువ శబ్ధం ఎక్కువ సౌకర్యం ఉండేలా రైల్వేలో ఏర్పాట్లుంటాయని వెల్లడించారు. ప్యాసింజర్లే రైల్వేకు బ్రాండ్ అంబాసిడర్లని సురేశ్ ప్రభు వెల్లడించారు. 
 
వడోదరాలో రైల్వే యూనివర్శిటీని ఏర్పాటు చేస్తామని, చెన్నైలో మొదటి రైల్వే ఆటో హబ్ ఏర్పాటు కానుందని సురేశ్ ప్రభు తెలిపారు. గత ఏడాదితో పోల్చితే 20 శాతం రైల్వే ప్రమాదాలు తగ్గినట్లు తెలిపారు. ఈ బడ్జెట్‌లో 44వేల కొత్త ప్రాజెక్టులు, 65వేల కొత్త బెర్తుల్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 2500 కి.మీ మేర బ్రాడ్ గ్రేజ్ లైన్లు ఉంటాయన్నారు. 100 స్టేషన్లలో కొత్తగా వైఫై సేవలు ఎస్కలేటర్లుంటాయని చెప్పుకొచ్చారు. 
 
ముఖ్యాంశాలు : 
* వెయ్యి రైళ్లలో బయోటాయిలెట్లు 
* ఎస్ఎమ్ఎస్ చేస్తే టాయిలెట్ శుభ్రం 
* చిన్న పిల్లల కోసం ప్రత్యేక ఆహారం 
* ఆన్ లైన్లో జర్నలిస్టులకు రాయితీలు 
* 408 స్టేషన్లలో ఈ క్యాటరింగ్
* రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి మెట్రో రైలు ప్రాజెక్టులు 
* 2020 నాటికి గూడ్స్ రైళ్లకు కూడా టైమ్ టేబుల్
* బుకింగ్ సమయంలోనే ప్రయాణ బీమా 
* రైల్వే స్టేషన్లో ఎఫ్ఎమ్ సేవలు కల్పించే దిశగా బడ్జెట్‌ను రూపొందించామన్నారు.