శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 26 మే 2015 (19:19 IST)

మహీంద్రా నుంచి ఎక్స్‌యూవీ 500 యుటిలిటీ వెహికల్

దేశంలో ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కొత్తగా న్యూ ఏజ్ ఎక్స్‌యూవీ500 యుటిలిటీ కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ కొత్త వేరియంట్‌లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, పుష్ బటన్ స్టార్ట్, ఆరు విధాలుగా అడ్జెస్ట్ చేసుకునే సీట్లు, తదితర ప్రత్యేకతలున్నాయని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రవీణ్ షా వెల్లడించారు.
 
 
ఇదే అంశంపై ఆయన మంగళవారం చెన్నైలో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ఈ అప్‌డేటెడ్ వెర్షన్‌లోని ఎంట్రీ లెవెల్ వేరియంట్ డబ్ల్యూ4 ధర రూ.11.34 లక్షలని వివరించారు. ప్రస్తుతం ఎస్‌యూవీ సెగ్మెంట్లో తమ మార్కెట్ 40 శాతమని, దీనిని మరింతగా పెంచుకోవడానికి ఈ కొత్త వేరియంట్ ఉపకరిస్తుందని వివరించారు.
 
ఈ కొత్త వేరియంట్‌లో క్రోమీ ఇన్‌సర్ట్‌తో స్టైలిష్ న్యూ ఫ్రంట్ గ్రిల్, న్యూ మస్కలర్ బోన్నెట్, న్యూ మస్కలర్ బంపర్, న్యూ అల్లాయ్ వీల్స్, విండ క్రోమీ లైనింగ్, న్యూ పా స్టైలిష్‌డ్ డూర్ హ్యాండిల్స్‌తో పాటు అనేక ఫ్యూచర్లను ఉన్నాయని చెప్పారు. అలాగే న్యూ ఎలక్ట్రిక్ సన్ రూఫ్, లోగో ప్రొజెక్షన్ ల్యాంప్స్, పుష్ బట్టన్ స్టార్ట్, స్టాఫ్, ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, మైక్రోహైబ్రిడ్ టెక్నాలజీ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 
 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది మోడళ్లను మార్కెట్లోకి తేనున్నామని పవన్ గోయెంకా చెప్పారు. వీటిల్లో 2 కొత్త కాంపాక్ట్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ ఉన్నాయని, వీటితో పాటు ప్రస్తుతమున్న మోడళ్లలో కొత్త వేరియంట్లను అందిస్తామన్నారు. ఇక కొత్తగా తేనున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలను తక్కువ ధరల్లోనే అందిస్తామన్నారు. ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో అందిస్తున్న క్వాంటో మోడల్ ధర (రూ.6.65 లక్షలు - 8.17 లక్షలు) కంటే తక్కువకే ఈ కొత్త ఎస్‌యూవీలను అందిస్తామన్నారు. ఈ క్వార్టర్‌లోనే వెరిటో ఎలక్ట్రిక్ వేరియంట్‌ను అందిస్తామని తెలిపారు.