శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By chitra
Last Updated : సోమవారం, 8 ఆగస్టు 2016 (10:45 IST)

పడిపోయిన బ్యారెల్ ధరలు... 20 శాతం తగ్గనున్న గ్యాస్ ధరలు

దేశంలో సహజ వాయువు ధరలు తగ్గనున్నాయి. అక్టోబరు నెల ఒకటో తేదీ నుంచి యూనిట్‌కు (ఎంబీటీయూ) 20 శాతం మేర తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 3.06 డాలర్ల నుంచి 2.45 డాలర్లకు దిగి రానున్నాయి.

దేశంలో సహజ వాయువు ధరలు తగ్గనున్నాయి. అక్టోబరు నెల ఒకటో తేదీ నుంచి యూనిట్‌కు (ఎంబీటీయూ) 20 శాతం మేర తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 3.06 డాలర్ల నుంచి 2.45 డాలర్లకు దిగి రానున్నాయి. తగ్గించిన ధరలు అక్టోబర్‌ 1వ తేదీ నుంచే అమల్లోకి వస్తాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, గత 18  నెలలుగా ఇది నాలుగో తగ్గింపు. 
 
2014లో ఎన్డీయే ప్రభుత్వం ఆమోదించిన నిర్దిష్ట ఫార్ములా ప్రకారం ఈ చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం ఆమోదించిన ఫార్ములా ప్రకారం గ్యాస్ ధరను ప్రతి ఆరు నెలలకు ఒకసారి సవరించాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే తాజాగా మార్పులు జరగనున్నాయి.
 
కాగా, గత ఏప్రిల్‌లో 3.82 డాలర్ల నుంచి 3.06  డాలర్లకు తగ్గించారు. దీంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఓన్‌జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ ధరలు తగ్గనున్నాయి. ఈ పథకం అమలు తర్వాత గ్యాస్ ధరలు దాదాపు 39 శాతం క్షీణించాయి.