గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 13 ఫిబ్రవరి 2016 (10:37 IST)

ఐసీఏఐ చరిత్రలో తొలిసారి: అధ్యక్షుడిగా తెలుగోడు దేవరాజరెడ్డి!

ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ-భారత చార్టెర్డ్ అకౌంట్ల సంఘం) చరిత్రలో తొలిసారిగా తెలుగు నేలకు చెందిన వ్యక్తి అధ్యక్ష పదవి చేపట్టి రికార్డు సృష్టించారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి దేవరాజరెడ్డి సంస్థకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. చార్టెర్డ్ అకౌంటెన్సీలో 28 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గడించిన దేవరాజరెడ్డి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులో స్థిరపడ్డారు.  
 
తిరుపతికి చెందిన దేవరాజరెడ్డి ఐసీఏఐ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 64 ఏళ్ల సంస్థ చరిత్రలో ఇప్పటిదాకా అధ్యక్ష పదవి చేపట్టిన వాళ్లలో ఒక్క తెలుగు వ్యక్తి కూడా లేరు. దీనిని చెరిపేస్తూ దేవరాజరెడ్డి తొలిసారిగా ఆ సంస్థ అధ్యక్ష పదవిని చేపట్టడం గమనార్హం. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో దేవరాజరెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.