Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కొత్త నోట్ల రంగులేంటి? సైజులేంటి? ఢిల్లీ హైకోర్టు ప్రశ్న

గురువారం, 7 డిశెంబరు 2017 (15:46 IST)

Widgets Magazine

పెద్దనోట్లను రద్దు చేసిన అనంతరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త నోట్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా విడుదల చేసిన రూ.50, రూ.200 నోట్లపై ఢిల్లీ హైకోర్టు కీలక సూచనలు చేసింది. కొత్తగా విడుదల చేసిన రూ.50, రూ.200 నోట్లను మార్చే అంశాన్ని పరిశీలించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి, ఆర్బీఐకి కీలక సూచనలు చేసింది. 
 
కొత్త నోట్లు వర్ణాంధత్వం ఉన్నవారు గుర్తించేందుకు అనువుగా లేనందున ఈ నోట్ల రంగును మార్చాలని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎలాంటి అవకాశమున్నా ఈ నోటు రంగుల్లో మార్పు చేయాలని హైకోర్టు కోరింది. నోట్ల రంగుతో పాటు గుర్తింపు చిహ్నాలను కూడా మార్చాలని హైకోర్టు సూచించింది. కరెన్సీ సైజుల విషయంలో మార్పులు అవసరమని కేంద్రానికి, ఆర్బీఐ సూచించింది. 
 
ఈ విషయాలను కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆర్బీఐ కూడా ముందుగానే గమనించివుండాల్సిందని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. కొత్త నోట్ల లోటుపాట్లపై దాఖలైన పిటిషన్‌పై తదుపరి విచారణను జనవరి 31కి కోర్టు వాయిదా వేసింది. ఇంతలోపు ఆర్బీఐ కొత్తగా ముద్రించిన నోట్లపై నివేదిక ఇవ్వాలన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

కారుంటే గ్యాస్ రాయితీ కట్.. కేంద్రం అడుగులు

వంట గ్యాస్‌పై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీని పూర్తి రద్దు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ...

news

అమేజాన్ డెలివరీ ఉమెన్ ఏం చేసిందో తెలుసా? (వీడియో)

అమెజాన్ సంస్థలో పని చేసే డెలివరీ ఉమెన్ ఓ పాడుపని చేసింది. సీసీటీవీ ఫుటేజ్ చూసిన ఇంటి ...

news

వీటికి ఈనెలాఖరువరకే ఆధార్ డెడ్‌లైన్

ఆధార్ అనుసంధాన గడువు సమీపిస్తోంది. కొన్నింటికి ఈనెలాఖరులోగా ఆధార్ నంబరు అనుసంధానం ...

news

మోదీకి నిస్సాన్ నోటీసులు.. రూ.5వేల కోట్లు చెల్లించలేదు..

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జపాన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ నిస్సాన్ షాక్ ...

Widgets Magazine