శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 11 ఫిబ్రవరి 2017 (15:07 IST)

నోట్ల రద్దు వల్లే రఘురాం రాజన్ వెళ్లిపోయారు : చిదంబరం

భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా పని చేస్తూ వచ్చిన రఘురాం రాజన్ ఆ పదవి నుంచి తప్పుకోవడానికి ఉన్న కారణాల్లో నోట్ల రద్దు ఒకటి అని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిదంబరం తెలిపారు.

భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా పని చేస్తూ వచ్చిన రఘురాం రాజన్ ఆ పదవి నుంచి తప్పుకోవడానికి ఉన్న కారణాల్లో నోట్ల రద్దు ఒకటి అని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిదంబరం తెలిపారు. 'ఫియర్‌లెస్ ఇన్ అపోజిషన్, పవర్ అండ్ అకౌంట్‌బిలిటీ' పేరుతో ఆయన రాసిన పుస్తకం విడుదల సందర్భంగా చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
ఇందులో ఆయన మాట్లాడుతూ... రఘురాం రాజన్ ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి దిగిపోయిన రోజు భారతీయ రిజర్వు బ్యాంకు నుంచి నోట్ల రద్దుకు వ్యతిరేకంగా కేంద్రానికి ఐదు పేజీల లేఖ అందిందన్నారు. దమ్ముంటే కేంద్రం ఆ లేఖను విడుదల చేయాలని సవాలు విసిరారు. 
 
''ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుంటే కనుక ఆ లేఖను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఆ లేఖలో నోట్ల రద్దు గురించి ప్రస్తావిస్తూ దానికి వ్యతిరేకంగా అందులో వాదించారని చిదంబరం తెలిపారు. ఆర్బీఐ నుంచి రాజన్ వెళ్లిపోవడానికి గల కారణాల్లో నోట్ల రద్దు కూడా ఒకటని ఆయన పేర్కొన్నారు.