శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2015 (16:32 IST)

సిమ్ కొంటే ఉల్లిగడ్డలు ఫ్రీ: క్యాష్ చేసుకుంటోన్న ఐడియా

ఐడియా సిమ్ కొనండి.. ఉల్లిగడ్డలను ఉచితంగా పొందండి. ఇదేంటి అనుకుంటున్నారా?.. నిన్నటి వరకు సిమ్ కార్డు కొంటే టాక్ టైం ఉచితం, డేటా ఉచితం అంటూ ప్రచారం చేశారు. తాజాగా ఉల్లిపాయల ధరలు ఆకాశాన్నంటిన వేళ ఓ మొబైల్ నెట్‌వర్క్ సంస్థ చాలా తెలివిగా దాన్ని క్యాష్ చేసుకుంటోంది. 
 
తమ కంపెనీ సిమ్ కొన్నవారికి ఓ కిలో ఉల్లిపాయలు ఉచితంగా ఇస్తామని బ్యానర్లు ప్రదర్శిస్తూ 'ఐడియా' సంస్థ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. హైదరాబాద్‌లోని దిల్ సుఖ్ నగర్ చౌరస్తాలో ఇలా బ్యానర్లు కట్టి, ఉల్లిపాయలు ఆఫర్ ఇస్తూ ఐడియా సిమ్ కార్డులు విక్రయించుకుంటున్నారు. బిజినెస్ ట్రిక్స్ అంటే ఇదేనని ఇతరత్రా కంపెనీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. 
 
కాగా దేశవ్యాప్తంగా ఉల్లిగోల రోజు రోజుకీ పెరిగిపోతోంది. అయితే ఉల్లి పెట్టే కన్నీళ్లు తుడుస్తామంటూ తాజాగా ఆన్ లైన్ పచారీ కేంద్రాలు రంగంలోకి దిగాయి. మార్కెట్‌లో ప్రస్తుతం రూ.80 దాకా పలుకుతున్న కిలో ఉల్లిని తాము రూ.40 నుంచి రూ. 69కే అందిస్తామంటూ పలు ఆన్ లైన్ విక్రయ కేంద్రాలు ప్రకటనలు జారీ చేశాయి. ‘లోకల్ బన్యా’, ‘మేరా గ్రోసర్’, ‘ఫ్రెస్ పాల్ సబ్జీ.కామ్’లు ఈ తరహా విక్రయాలకు తెరలేపాయి.