Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కారుంటే గ్యాస్ రాయితీ కట్.. కేంద్రం అడుగులు

బుధవారం, 6 డిశెంబరు 2017 (09:02 IST)

Widgets Magazine
gas cylinder

వంట గ్యాస్‌పై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీని పూర్తి రద్దు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగా, ఇప్పటికే అనేక రకాల చర్యలు చేపట్టింది. ముఖ్యంగా, నకిలీ వంట గ్యాస్ కనెక్షన్లను ఏరివేసే చర్యలు చేపట్టి, ఆధార్ నంబరు, బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేసింది. అంటే గ్యాస్‌కు ఇస్తున్న రాయితీని నేరుగా బ్యాంకు ఖాతాలో జమచేస్తోంది. ఇలా చేయడం ద్వారా దేశ వ్యాప్తంగా దాదాపు 3.6 కోట్ల నకిలీ గ్యాస్ కనెక్షన్లను రద్దు చేసింది. ఇది తొలిదశ మాత్రమే.
 
ఇక రెండో దశలో కారున్న వాళ్లపై సబ్సిడీ ఎత్తివేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఆర్టీయే కార్యాలయాల నుంచి కారు యజమానుల సమాచారాన్ని తెప్పించారు. వార్షిక ఆదాయం 10 లక్షలు దాటిందా లేదా చూస్తున్నారు. ఈ లెక్కల్లో ఎక్కువ మంది ఆదాయాలు పది లక్షలు దాటినట్లయితే వారికి ఒక్కవేటున గ్యాస్‌ సబ్సిడీని ఎత్తేస్తారు. తమకు అంత ఆదాయం లేదని ఎవరైనా నిరూపించుకుంటే మళ్లీ సబ్సిడీని పునరుద్ధరిస్తారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

అమేజాన్ డెలివరీ ఉమెన్ ఏం చేసిందో తెలుసా? (వీడియో)

అమెజాన్ సంస్థలో పని చేసే డెలివరీ ఉమెన్ ఓ పాడుపని చేసింది. సీసీటీవీ ఫుటేజ్ చూసిన ఇంటి ...

news

వీటికి ఈనెలాఖరువరకే ఆధార్ డెడ్‌లైన్

ఆధార్ అనుసంధాన గడువు సమీపిస్తోంది. కొన్నింటికి ఈనెలాఖరులోగా ఆధార్ నంబరు అనుసంధానం ...

news

మోదీకి నిస్సాన్ నోటీసులు.. రూ.5వేల కోట్లు చెల్లించలేదు..

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జపాన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ నిస్సాన్ షాక్ ...

news

ఆ విమానాల్లో పిచ్చపిచ్చగా ప్రయాణించేయవచ్చు... ఎలా?

విమాన ప్రయాణం కూడా తక్కువ ధరకే చేసేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి కొన్ని విమాన సర్వీసులు. ...

Widgets Magazine