మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 9 జనవరి 2017 (10:26 IST)

ఆర్బీఐ గవర్నర్‌కు ఊహించని షాక్... నోట్ల రద్దు మీ ఒక్కరి నిర్ణయమా? వివరణ ఇవ్వండి : పీఏసీ నోటుసులు

భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు పార్లమెంటరీ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఊహించని షాకిచ్చింది. దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలంటూ ఆ నోటీ

భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు పార్లమెంటరీ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఊహించని షాకిచ్చింది. దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొంది. ఈనెల 28వ తేదీ ముందు హాజరై సమాధానం ఇవ్వాలని అందులో ప్రస్తావించింది.
 
దేశంలో నోట్ల రద్దు నిర్ణయం వెనుక ఆర్బీఐ పాత్ర ఏమిటి? దేశ ఆర్థిక వ్యవస్థపై అది చూపిన ప్రభావం, రెండు నెలల్లో వచ్చిన మార్పు వంటి అంశాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సరైన ఆధారాలు ఇవ్వకుంటే ఇవ్వకుంటే అధికారాన్ని దుర్వినియోగం చేసినట్టేనని తెలిపింది. ఈ క్రమంలో గవర్నర్ విధుల నుంచి ఎందుకు తొలగించరాదో స్పష్టం చేయాలని పేర్కొంది. 
 
రద్దు నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంకు తీసుకుందని, దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ పార్లమెంటులో చెప్పిన మాటలు నిజమేనా? ఒకవేళ ఆర్బీఐ ఆలోచనే అయితే, నోట్లరద్దుపై ఎప్పుడు చర్చించారని ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించింది. దీనికి ఆర్బీఐ నుంచి ఎలాంటి రిప్లై వస్తుందో చూడాలి.