Widgets Magazine

ఆదాయం నష్టపోని విధంగా జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ - డీజిల్

గురువారం, 21 జూన్ 2018 (09:09 IST)

దేశంలో పెట్రో మంటపై ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. రికార్డు స్థాయిలో ఈ ధరలు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో "కర్ర విరగకుండా, పాము చావకుండా" అనే చందంగా పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావాలని కేంద్రం భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
petrol price
 
ముఖ్యంగా, తమ ఆదాయంతో పాటు పెట్రో ఉత్పత్తులపై రాష్ట్రాలకు వచ్చే ఆదాయం నష్టపోని రీతిలో ఈ పని పూర్తి చేయాలని కేంద్రం ప్రయత్నిస్తున్నట్టు అధికార వర్గాల సమాచారం. పెట్రోల్‌, డీజిల్‌తో పాటు పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ససేమిరా అంటున్నాయి. 
 
అదే జరిగితే తాము పెద్ద ఎత్తున ఆదాయం నష్టపోవాల్సి ఉంటుందని భయపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వానిదీ ఇదే పరిస్థితి. దీంతో ఎవరూ నష్టపోని విధంగా జీఎస్టీలోని గరిష్టంగా 28 శాతం శ్లాబులో చేర్చి, అదనంగా వ్యాట్‌ చేర్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. పెట్రోల్‌పై దాదాపు అన్ని దేశాలు జీఎస్టీతో పాటు ఇతర పన్నులూ వడ్డిస్తుండటంతో ఇదే సూత్రాన్ని అనుసరించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

కొత్త రూ.2వేలు, రూ. 200 నోట్లు చిరిగితే.. బ్యాంకులు తీసుకోవట్లేదు.. ఎందుకంటే?

రూ.2వేలు, రూ.200 కరెన్సీ నోట్లను భద్రంగా కాపాడుకోవాలట. ఎందుకంటే ఇక పాత కరెన్సీలా చిరిగిన ...

news

భారతీయుల్లో నిజాయితీ లేదు.. పీసీ మాటలు వింటే చేతిలో చిప్పే: అరుణ్ జైట్లీ

భారతీయులపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయుల్లో నిజాయితీ ...

news

ముంబై-పూణే రహదారిపై రద్దీ రద్దీ.. హైపర్ లూప్ విధానం వచ్చేస్తోంది..

ముంబై-పూణే రహదారిపై వాహన రద్దీని తగ్గించేలా రెండు నగరాల మధ్య హైపర్ లూప్ సిస్టమ్‌ను ...

news

అన్‌ రిజర్వుడ్ టిక్కెట్ల కోసం సరికొత్త యాప్

అన్ రిజర్వుడ్ టిక్కెట్ల కోసం సరికొత్త యాప్‌ను రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది. రద్దీ ...

Widgets Magazine