గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 28 ఆగస్టు 2015 (13:26 IST)

భవిష్యత్‌లో రూ.30 కంటే దిగువకు చేరనున్న లీటర్ పెట్రోల్ ధర?

దేశంలో పెట్రోల్ ధరలు మరింత పతనం కానున్నాయా? అవుననే చెపుతోంది స్టాండర్డ్ చార్టర్డ్ సంస్థ. ఈ మేరకు 2016 సంవత్సర అంచనాలను ఆ సంస్థ వెల్లడించింది. వాటి ప్రకారం... సమీప భవిష్యత్తులో క్రూడాయిల్ ధర 20 డాలర్ల వరకూ పడిపోవచ్చని తెలిపింది. ఒకవేళ బేరిష్ మార్కెట్ ముగిసి ధరలు పెరిగితే, గరిష్ఠంగా 63 డాలర్లను దాటే అవకాశాలు లేవని వెల్లడించింది. 
 
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు భారత బాస్కెట్ ధర ప్రస్తుతం 46 డాలర్ల వద్ద ఉండగా, హైదరాబాదులో లీటరు పెట్రోలు ధర రూ.68.45 వద్ద కొనసాగుతోంది. భవిష్యత్తులో క్రూడాయిల్ ధర స్టాండర్డ్ చార్టర్డ్ అంచనా వేసినట్టుగా 20 డాలర్లకు పతనమైన పక్షంలో లీటరు పెట్రోలు ధర రూ.30 కంటే తక్కువ స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేసింది. అయితే, ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వాలు పన్నులు పెంచకుండా ఉంటేనే ఆ లబ్ది ప్రజలకు దగ్గరవుతుంది.