శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 25 నవంబరు 2014 (15:25 IST)

దేశంలో మరోమారు తగ్గనున్న పెట్రోల్ - డీజిల్ ధరలు!

దేశంలో మరోమారు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయి. ఉత్పత్తి చేస్తున్న క్రూడాయిల్ పరిమాణాన్ని తగ్గించేందుకు ఒపెక్ అంగీకరించేలా లేకపోవడంతో అంతర్జాతీయ స్థాయిలో బ్యారల్ క్రూడాయిల్ ధర మరింత తగ్గింది. మంగళవారం సెషన్‌లో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారల్‌కు 9 సెంట్లు తగ్గి 79.59 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఈ ధర మరింతగా తగ్గవచ్చని నిపుణుల అంచనా. 
 
వాస్తవానికి గత వారం రోజులుగా క్రూడాయిల్ ధర తగ్గుతూ వస్తున్న నేపథ్యంలో భారత్‌లో సైతం ధరల సవరణ జరగనుంది. భారత చమురు కంపెనీలు ఈ వారం చివరలో పెట్రోల్ తగ్గింపు విషయంలో ఒక ప్రకటన చేసే అవకాశం వుంది. నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటివరకు 7 సార్లు పెట్రోల్ ధర తగ్గిన సంగతి తెలిసిందే.