Widgets Magazine

పెరుగుతున్న పెట్రోల్ ధరలు- ఆల్ టైమ్ రికార్డ్.. సామాన్యుడికి చుక్కలు

ఆదివారం, 16 సెప్టెంబరు 2018 (11:56 IST)

పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యునికి చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్ ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న క్రూడాయిల్ ధరల వల్లే పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయని కేంద్రం ప్రకటించింది.
petrol


ప్రస్తుతం బ్రెంట్ క్రూడాయిల్ ధర 78 డాలర్ల వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో రూపాయి మారకపు విలువలో బలహీన పడటం కూడా ఈ ధరల పెరుగుదలకు సహకరిస్తోందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 
 
తాజాగా పెట్రోలు ధర ఆదివారం సరికొత్త ఆల్ టైమ్ రికార్డుకు చేరుకుంది. ఆదివారం పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 81.91కి, డీజిల్ ధర రూ. 73.72కు పెరిగింది.

ముంబయిలో పెట్రోలు ధర ఏకంగా రూ. 89.29కి చేరగా, డీజిల్ ధర రూ. 78.26కు చేరింది. దీంతో దేశ చరిత్రలో పెట్రోలు ధర రూ. 89ని దాటి ముందుకెళ్లడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. తద్వారా పెట్రోల్ ధర సరికొత్త రికార్డును చేరుకున్నట్లైంది.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

శారిడాన్‌కు సలాం.. మార్కెట్టో శారిడాన్ టాబ్లెట్ మాయం

తలనొప్పి అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు శారిడాన్... ఒకే ఒక సారిడన్.. తలనొప్పులన్నీ మాయం.. ...

news

అరుణ్ జైట్లీకి చెప్పాకే లండన్‌కు వచ్చా : విజయ్ మాల్యా

కేంద్ర ఆర్థిక మంత్రి విజయ్ మాల్యాకు చెప్పిన తర్వాతే తాను లండన్‌కు వచ్చినట్టు ప్రముఖ ...

news

పెట్రోల్ ధరలపై బీజేపీ స్పెషల్ గ్రాఫ్... పడీపడీ నవ్వుకుంటున్న నెటిజన్లు

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న పెట్రోల్ ధరలపై భారతీయ జనతా పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో ...

news

సెంచరీకి చేరువలో పెట్రోల్ ధర.. మోడీ హయాంలో సరికొత్త రికార్డు

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ...

Widgets Magazine