గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 9 జనవరి 2017 (08:31 IST)

పెట్రోల్ బంకు కస్టమర్లకు ఊరట... 13 వరకు డెబిట్/క్రెడిట్ కార్డులు ఓకే...

దేశంలోని పెట్రోల్ బంకు వినియోగదారులకు స్వల్ప ఊరట లభించింది. కార్డు స్వైపింగ్ ద్వారా పెట్రోలు అమ్మకాలను నిలిపివేయాలన్న నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు పెట్రోలు బంకుల యాజమాన్యాల సంఘం ప్రకట

దేశంలోని పెట్రోల్ బంకు వినియోగదారులకు స్వల్ప ఊరట లభించింది. కార్డు స్వైపింగ్ ద్వారా పెట్రోలు అమ్మకాలను నిలిపివేయాలన్న నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు పెట్రోలు బంకుల యాజమాన్యాల సంఘం ప్రకటించింది. 
 
కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇచ్చిన హామీతో ఈ నెల 13 వరకు ఈ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్టు ఆ సంఘం ప్రతినిధులు వెల్లడించారు. అయితే ఆర్బీఐ విధించిన 1 శాతం పన్ను విధింపు మీద బంకుల యజమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
 
లావాదేవీల ఫీజును బ్యాంకులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ కార్డుల స్వీకరణను సోమవారం అర్థరాత్రి నుంచి కార్డులపై పెట్రోల్ అమ్మకాన్ని నిలిపివేయాలని యజమానులు హెచ్చరించాయి. దీంతో ఆదివారం అర్థరాత్రి నుంచే పెట్రోలు బంకుల ఎదుట కస్టమర్లు పెద్దఎత్తున బారులు తీరారు.
 
కార్డుల చెల్లింపులపై వసూలు చేయాల్సిన అదనపు ఛార్జీలను డీలర్ల నుంచి వసూలు చేయాలని నిర్ణయించడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. డీజిల్‌పై 2.5 శాతం, పెట్రోల్‌పై 3.2 శాతం చొప్పున డీలర్లకు కమిషన్‌ వస్తుందని.. అందులో నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించడం సరికాదన్నారు. 
 
తమ లావాదేవీలపై ఒక శాతం వరకు మర్చంట్ డిస్కౌంట్ రేటును హెచ్‌డీ‌ఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంకులు డిమాండ్ చేస్తున్నాయని, ఇది తమకు అంగీకారయోగ్యం కాదని ఆలిండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ బన్సాల్ తెలిపారు. ఏమైనా లావాదేవీల ఫీజు విధింపును ఈ నెల 13 వరకు వాయిదా వేయాలని బ్యాంకులు కూడా నిర్ణయించాయి.